INDW vs AUSW Test : భారత మహిళల జట్టు బ్యాట్ తో మరో అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసి 187 పరుగుల ఆధిక్యం సాధించింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నగులురు ప్లేయర్లు ఆఫ్ సెంచరీలతో రాణించారు. స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ మరోసారి 400లకు పైగా స్కోర్ చేసింది.
భారత్ తరఫున దీప్తి 78 పరుగులు చేయగా, స్మృతి మంధాన 106 బంతుల్లో 74 పరుగులు చేసింది. స్నేహ్ రాణా (9), హర్మన్ప్రీత్ కౌర్ (0), యస్తికా భాటియా (1) మినహా దాదాపు ప్రతి భారత బ్యాట్స్ మెన్ శుభారంభం చేశారు. ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ కూడా లోయర్ ఆర్డర్లో విలువైన సహకారం అందించి. 126 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్ స్కోరును 400 పరుగులు దాటేలా చేసింది. రిచా ఘోష్ 52 పరుగులతో రాణించింది. రోడ్రిగ్స్ 73 పరుగులు చేసింది.
టెస్టు మ్యాచ్ ల్లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400+ స్కోరు చేయడం ఇది రెండోసారి. గత టెస్టులో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 428 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో నలుగురు భారత బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు సాధించి మ్యాచ్ కు టోన్ సెట్ చేశారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ ల్లో 136, 131 పరుగులకే ఆలౌటైంది.
ప్రస్తుత టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 219 పరుగులు చేసింది. బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ పూజా వక్స్ట్రాకర్ 4 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డనర్ 4 వికెట్లు తీసింది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 63/2 (17) పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసింది.