Published : Dec 22, 2023, 04:23 PM ISTUpdated : Dec 22, 2023, 04:25 PM IST
Tushar Deshpande Marriage: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్ పాండే తన 'స్కూల్ క్రష్' నభా గడ్డంవార్ తో జతకట్టాడు. జూలైలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా, తాజాగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి.
CSK star Tushar Deshpande Marriage: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ తుషార్ దేశ్ పాండే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన స్కూల్ క్రష్ తుషార్ నభా గడ్డంవార్ ను జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. సీఎస్కే ఆటగాడు తుషార్ పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తుషార్ వివాహానికి దగ్గరి బంధువులతో పాటు కొందరు స్నేహితులను హాజరయ్యారు.
24
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar
మీడియా కథనాల ప్రకారం.. తుషార్, నభాలు స్కూల్ డేస్ నుంచి ఒకరికొకరు తెలుసు. ఆ తర్వాత కాలేజీలో కూడా కలిసి చదువుకున్నారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
34
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar
పెళ్లి ఫొటోలను తుషార్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. డిసెంబర్ 21న వీరిద్దరి వివాహం జరిగింది. జూన్ 12న వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక నభా విషయానికొస్తే ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ గా ఉంటుంది. ఆమె తుషార్ స్కూల్ క్రష్ అనీ, చాలా ఏళ్ల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం.
44
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar
తుషార్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్. జట్టు తరఫున పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దేశవాళీ మ్యాచుల్లో కూడా తుషార్ కు మంచి రికార్డు ఉంది. ఇక తుషార్ ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 23 మ్యాచ్ లను ఆడాడు. ఇందులో 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్ లో తుషార్ అత్యుత్తమ ప్రదర్శన 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం. తుషార్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 81 వికెట్లు పడగొట్టాడు. 40 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 51 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఆడిన 67 టీ20 మ్యాచ్ లలో 99 వికెట్లు పడగొట్టాడు.