Surykuamr Yadav
Surykuamr Yadav Injury: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్. స్వదేశంలో ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ విజయం, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 33 ఏళ్ల ఈ ప్లేయర్ చీలమండల గాయానికి గురయ్యాడు.
Surykuamr Yadav
టీ20 ప్రపంచకప్ సన్నాహకాలకు ఎదురుదెబ్బ..
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు అఫ్గానిస్థాన్ సిరీస్ చివరి టీ20 సిరీస్. టీ20 వరల్డ్ కప్ కు సన్నాహకాలకు సరైన కాంబినేషన్ ను కనుగొనడానికి టీమ్ఇండియాకు మిగిలి ఉన్న ఏకైక సిరీస్ కూడా ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్ కు సూర్య దూరం కావడంతో భారత జట్టు టీ20 ప్రపంచకప్ సన్నాహకాలు కొంతమేర దెబ్బతినడం ఖాయం.
Suryakumar Yadav
జొహన్నెస్ బర్గ్ టీ20లో గాయం
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యకుమార్ యాదవ్ కాలి మడమకు గాయమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సూర్య అద్భుత సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు వచ్చినప్పుడు మూడో ఓవర్ లో ప్రొటీస్ బ్యాట్స్ మన్ వేసిన షాట్ ను ఆపి బంతి విసురుతుండగా ఈ గాయానికి గురయ్యాడు.
suryakumar yadav
గాయం తర్వత వెంటనే భారత క్రికెట్ ఫిజియో బృందం సూర్య కుమార్ యాదవ్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. మిగిలిన మ్యాచ్ ల్లో వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా టీం ఇండియా పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించగా సూర్యకుమార్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి ప్రశ్నించగా.. నేను క్షేమంగానే ఉన్నానని సమాధానమిచ్చాడు. నడుస్తున్నానని చెప్పాడు. దీంతో గాయం త్వరలోనే తగ్గుతుందని భావించారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండు నెలల పాటు విశ్రాంతిలో ఉండనున్నాడు.