ఊ అంటారా లేక ఊరికే కూర్చోబెడతారా..? పృథ్వీ షాకు మూడో టీ20లో అయినా ఛాన్స్ ఇస్తారా..?

First Published Jan 31, 2023, 4:34 PM IST

INDvsNZ: ఏడాదిన్నర కాలంగా  దేశవాళీలో రాణించిన  షా...  ప్రస్తుతం న్యూజిలాండ్ తో స్వదేశంలో  జరుగుతున్న  టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. అయితే రెండు మ్యాచ్ లు ముగిసినా..  అతడికి తుది జట్టులో చోటు రాలేదు. 

చిన్న వయసులోనే  అంతర్జాతీయ క్రికెట్ లోకి  ఎంట్రీ ఇచ్చినా.. తన ఆటతో  మరో సెహ్వాగ్ అవుతాడని అందరి చేత ప్రశంసలు  దక్కించుకున్నా.. పృథ్వీ షా మాత్రం  టీమ్ లోకి వచ్చినంత త్వరగా వెళ్లిపోయాడు.  ఆ తర్వాత దేశవాళీలో   మళ్లీ రెండు మూడేండ్ల పాటు  పరుగుల వరద పారిస్తే తప్ప అతడికి టీమిండియాలో చోటు దక్కలేదు. 

ఏడాదిన్నర కాలంగా  దేశవాళీలో రాణించిన  షా...  ప్రస్తుతం న్యూజిలాండ్ తో స్వదేశంలో  జరుగుతున్న  టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. అయితే రెండు మ్యాచ్ లు ముగిసినా.. ఓపెనర్లు ఇద్దరూ దారుణంగా విపలమైనా  షా కు  టీమ్ లో  ప్లేస్ కన్ఫర్మ్ కాలేదు.  

ఈ ఏడాది వన్డేలలో దుమ్మురేపుతున్న శుభ్‌మన్ గిల్..  టీ20లలో విఫలమవుతున్నాడు.  రెండు టీ20లలో కలిపి గిల్ చేసింది 28 పరుగులే. కిషన్ కూడా బంగ్లాదేశ్ తో  డబుల్  సెంచరీ చేసిన తర్వాత  ఆడిన 8 ఇన్నింగ్స్ లలో కలిపి  వంద పరుగులు  కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో   అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే మూడో  టీ20లో షా కు చోటు దక్కుతుందని   వాదనలు వినిపిస్తున్నాయి. 
 

అయితే  టీమ్ మేనేజ్మెంట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు అహ్మదాబాద్  టీ20లో కూడా   పృథ్వీ షా బెంచ్ లో కూర్చోడం తప్పదని.. గిల్, ఇషాన్ లనే ఓపెనర్లుగా కొనసాగించేందుకు అటు టీమ్ మేనేజ్మెంట్ తో పాటు  కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఆసక్తి చూపుతున్నాడని  తెలుస్తున్నది. 

సిరీస్ డిసైడర్  మ్యాచ్ లో  పృథ్వీ ని ఆడిస్తే అతడి మీద ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒకవేళ  షా  ఫెయిల్ అయితే అతడికి  మళ్లీ టీమ్ లో చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలూ ఉన్నాయి.   ప్రస్తుతం జట్టు పరిస్థితి తెలిసిన ఓపెనర్లనే కొనసాగించడం బెటర్ అన్న భావనలో టీమ్ మేనేజ్మెంట్  ఉన్నట్టు సమాచారం.  

ఒకవేళ గిల్ ను ఉంచి ఇషాన్ ను తప్పించినా  అప్పుడు వికెట్ కీపర్  అవసరం ఉంటుంది.  ప్రస్తుతానికి జితేశ్ శర్మ బ్యాకప్ వికెట్ కీపర్ గా ఉన్నా అతడికి ఛాన్స్ దక్కేది అనుమానమే.   ధావన్ ను పక్కనబెట్టిన  టీమ్ మేనేజ్మెంట్.. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో  ఇషాన్  వరుసగా విఫలమవుతున్నా అతడికి అవకాశాలు ఇస్తున్నది. ఒక్క మ్యాచ్ కోసం ఇషాన్  ను తప్పించే సాహసం  టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. అదీగాక ఇషాన్ ను తప్పిస్తే లెఫ్ట్  హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా మిస్ అయ్యే ప్రమాదముందన్న  వాదన వినిపిస్తోంది. 

ఎలా చూసినా  మూడో టీ20లో కూడా   పృథ్వీకి రిజర్వ్ బెంచ్ తప్పేట్టు లేదు. ఒకవేళ మ్యాచ్ కు ముందు  టీమ్ ఆఖరి నిమిషంలో  ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప అహ్మదాబాద్ లో కూడా  షా  బెంచ్ కే పరిమితం కాక తప్పదని   టీమిండియా వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

click me!