ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది టీమిండియా ఓపెనింగ్ జోడీ. సచిన్ - గంగూలీ, సచిన్ - సెహ్వాగ్ తర్వాత టీమిండియాకు దొరికిన ఓపెనింగ్ జోడీ రోహిత్ - ధావన్. గత దశాబ్దంలో ఈ ఇద్దరూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే కొంతకాలంగా విరామం లేని క్రికెట్, వయసు భారం, ఫామ్ లేమి.. ఇలా కారణాలేమైతేనేమి ధావన్ జట్టుకు క్రమంగా దూరమవుతున్నాడు.