రంజీలైనా ఆడుకునేవాడుగా.. బెంచ్ మీద కూర్చోబెట్టేందుకు పిలిచారా..? మూడో టీ20లోనూ పృథ్వీ షా కు తప్పని నిరాశ

Published : Feb 01, 2023, 07:17 PM IST

INDvsNZ 3rd T20I Live: సుదీర్ఘ కాలం తర్వాత టీమ్ లోకి ఎంపిక చేయనైతే చేశారు గానీ  గడిచిన మూడు మ్యాచ్ లలో పృథ్వీ షాకు తుది జట్టులో అవకాశమివ్వలేదు. ఇషాన్ - గిల్   లలో ఎవరో ఒకర్ని తొలగించి షా ను ఆడించాలని   అటు క్రికెట్ పండితులు, ఇటు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోవడం లేదు. 

PREV
18
రంజీలైనా ఆడుకునేవాడుగా.. బెంచ్ మీద కూర్చోబెట్టేందుకు పిలిచారా..? మూడో టీ20లోనూ పృథ్వీ షా కు తప్పని నిరాశ

సుమారు మూడేండ్ల తర్వాత  భారత జట్టులో చటోు దక్కించుకున్న  టీమిండియా యువ ఓపెనర్  పృథ్వీ షా.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతను్న మూడో టీ20లో కూడా  చోటు దక్కించుకోలేకపోయాడు.  అతడికి మరోసారి నిరాశతప్పలేదు.  వరుసగా విఫలమవుతున్నా టీమ్ మేనేజ్మెంట్, హార్ధిక్ పాండ్యా మాత్రం.. శుభ్‌మన్ గిల్ - ఇషాన్ కిషన్ లకే మరో ఛాన్స్ ఇచ్చారు. 
 

28

వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లలో  మంచి ప్రదర్శనలు ఇచ్చిన గిల్.. బంగ్లాదేశ్ తో  డిసెంబర్ లో జరిగిన  మూడో వన్డేలో  డబుల్ సెంచరీ చేసిన తర్వాత  ఇషాన్ కిషన్ లు దారుణంగా విఫలమవుతున్నారు.   గిల్.. టీ20లకు పనికిరాడు అని క్రికెట్ విశ్లేషకులు మొత్తుకుంటున్నా  టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుసగా అవకాశాలిస్తూ  కొనసాగిస్తున్నది.  

38

న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ కు ఎంపికైన పృథ్వీ షా  ను  ఇషాన్  కు జోడిగా పంపాలని డిమాండ్లు వినిపిస్తున్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోవడం లేదు.  చాలాకాలం తర్వాత   భారత జట్టులో చోటు దక్కించుకున్న షా.. జాతీయ జట్టులోకి రావడానికంటే ముందు దేశవాళీలో  పరుగుల వరద పారించాడు. 

48

రంజీలు, విజయ్ హజారే, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో  పాటు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున   మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అటాకింగ్  గేమ్ తో ఐపీఎల్ లో అతడు ఆడిన ఆట విశ్లేషకులు, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. మరో వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాడిని పెట్టుకుని  టీమ్ లో చోటు కల్పించకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తాయి.   ఆఖరికి రంజీలలో ట్రిపుల్ సెంచరీ చేస్తే గానీ  సెలక్టర్లు అతడిని కరుణించలేదు. 

58

టీమ్ లోకి ఎంపిక చేయనైతే చేశారు గానీ  గడిచిన మూడు మ్యాచ్ లలో అతడికి తుది జట్టులో అవకాశమివ్వలేదు. ఇషాన్ - గిల్   లలో ఎవరో ఒకర్ని తొలగించి షా ను ఆడించాలని   అటు క్రికెట్ పండితులు, ఇటు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా  మేనేజ్మెంట్ మాత్రం  మొద్దు నిద్ర వీడటంలేదు.   అహ్మాదాబాద్ లో కూడా  షా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. 
 

68

ఈ మ్యాచ్ లో పృథ్వీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడితో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా  హార్ధిక్ పాండ్యా,  టీమ్ మేనేజ్మెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టేదానికి  షా ను  టీమ్ లోకి సెలక్ట్ చేయడమెందుకు..?  సెలక్ట్ చేయకుంటే కనీసం  రంజీలైనా ఆడుకునేవాడుగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

78
Image credit: PTI

తొలి రెండు  మ్యాచ్ లలో విఫలమైన  ఇషాన్ కిషన్.. అహ్మదాబాద్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.  మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన రెండో ఓవర్లో  రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  అయితే ఈ మ్యాచ్ కు ముందు బోర్డు వర్గాలు మాత్రం..  ఇషాన్ - గిల్ లకు సిరీస్ లో పరిస్థితుల మీద అవగాహన ఉందని.. వాళ్లు మూడో మ్యాచ్ లో రాణిస్తారని ఆశాభావం ఉందని గొప్పలకు పోయారు.  కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం. ఇషాన్ కిషన్  దారుణంగా విఫలమయ్యాడు 

88

కివీస్ తో  టీ20 సిరీస్ ముగిశాక  భారత జట్టు ఆసీస్ తో నాలుగు టెస్టులు,  మూడు  వన్డేలు ఆడుతుంది.  ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది.   అది మే వరకూ కొనసాగుతుంది.   ఆ తర్వాత  జూన్ - జులై వరకూ  భారత్ టీ20 మ్యాచ్ లు ఆడదు. దీనిని బట్టి చూస్తే  షా మళ్లీ భారత  టీ20 జట్టులో ఆడేది  ఐదారు నెలల తర్వాతే. 

click me!

Recommended Stories