ప్రాక్టీస్ కోసం చెత్త పిచ్! టీమిండియాని దెబ్బ తీసేందుకు సౌతాఫ్రికా పన్నాగం... విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే...

Published : Feb 01, 2023, 05:24 PM IST

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. ఆ రికార్డును ఈజీగా అందుకునేలా కనిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో బీసీసీఐతో విభేదాలు, మొత్తం స్టోరీనే మలుపు తిప్పాయి...

PREV
18
ప్రాక్టీస్ కోసం చెత్త పిచ్! టీమిండియాని దెబ్బ తీసేందుకు సౌతాఫ్రికా పన్నాగం... విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే...

గ్రేమ్ స్మిత్ తన టెస్టు కెరీర్‌లో 109 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 53 విజయాలు అందుకుంటే విరాట్ కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు అందుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా 41 విజయాల రికార్డుకి, రికీ పాంటింగ్ 48 టెస్టు విజయాల రికార్డును అందుకోవడం విరాట్‌కి పెద్ద కష్టమయ్యే పనేమీ కాదు...

28

స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచులు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్, ఇలా చూసుకుంటే ఈపాటికి విరాట్ కోహ్లీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ల జాబితాలో టాప్ 3 లోకి వచ్చేసేవాడే... 

38

అయితే బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీతో విభేదాలతో వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించబడి, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టీమ్‌పై ఎలాంటి ప్రభావం చూపించేవాడో తన ఆటోబయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్.. మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’ పుస్తకంలో రాసుకొచ్చాడు భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

48

‘2018లో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లినప్పుడు మాకు ప్రాక్టీస్ చేయడానికి ఓ కౌంటీ గ్రౌండ్ ఇచ్చారు. అది చాలా దారుణంగా ఉంది. ఆ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. దాంతో ప్లేయర్లు అందరూ భయపడి, ప్రాక్టీస్ చేయడానికి రాలేదు...

58

పిచ్ భయంకరంగా ఉందని ప్రాక్టీస్ చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. విరాట్ కోహ్లీ దీన్ని గమనించాడు. ప్యాడ్స్ కట్టుకుని, నన్ను సంజయ్‌ని, రఘుని పిలిచాడు. నేను బ్యాటింగ్ చేస్తాను, వెళ్లి బౌలింగ్ చేయమని చెప్పాడు...
 

68

నేను వద్దని వారించా.  బౌన్సర్లు ముఖానికి తగిలితే, గాయాలవుతాయని హెచ్చరించా. అయితే విరాట్ వినిపించుకోలేదు.  ‘ఇది చాలా ప్రమాదకరంగా ఉండాలి. ఈ డేంజరస్ వికెట్ మీదే నేను ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తారో చెయ్యండి...’ అని రఘుకి చెప్పాడు. విరాట్ ఇలాంటి  క్లిష్టమైన పరిస్థితులను బాగా ఎంజాయ్ చేస్తాడు...

78

ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తనకి తాను పరిష్కారాలు కనుక్కుంటూ ఉంటాడు. తన స్కిల్స్‌కి పరీక్ష పెడతాడు... మానసికంగా ధృడంగా చేసుకుంటూ ఉంటాడు. కోహ్లీని చూశాక మిగిలిన ప్లేయర్లు ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు...’ అంటూ రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్...
 

88

2018 సౌతాఫ్రికా పర్యటనలో 3 టెస్టుల్లో 286 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. తొలి టెస్టులో 153 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మూడో టెస్టులో మరో హాఫ్ సెంచరీ బాదాడు..

Read more Photos on
click me!

Recommended Stories