ప్రెస్ మీట్‌లో రోహిత్ పేరు చెప్పని హార్ధిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనందుకే...

Published : Jun 26, 2022, 07:40 PM ISTUpdated : Jun 26, 2022, 07:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ పర్పామెన్స్ కారణంగా నెల రోజుల గ్యాప్‌లోనే ఐర్లాండ్‌ టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెప్టెన్‌గా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కి ముందు ఇచ్చిన ప్రెస్ మీట్‌లో హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ పేరు ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
110
ప్రెస్ మీట్‌లో రోహిత్ పేరు చెప్పని హార్ధిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనందుకే...

రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో ఐర్లాండ్ టూర్‌లో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్సీ చేసే అవకాశాన్ని కొట్టేశాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

210

ఐర్లాండ్‌ టూర్‌కి ఎంపికైన జట్టులో దినేశ్ కార్తీక్ వంటి సీనియర్ ప్లేయర్ ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యాకే కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ...

310

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఇచ్చిన మీడియా కాన్ఫిరెన్స్‌తో హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ పేరు ప్రస్తావించలేదు. ‘విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా.అయితే వారిద్దరి ప్రభావం లేకుండా నా దారిలో కెప్టెన్సీ చేయాలనుకుంటున్నా. నేను ప్రాక్టీకల్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

410
Image credit: PTI

ముంబై ఇండియన్స్‌ నుంచి టీమిండియాలోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఏడు సీజన్లు ఐపీఎల్ ఆడాడు. అలాగే 2018లో ఆసియా కప్ గెలిచిన టీమ్‌లోనూ ఉన్నాడు. అలాంటిది రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి హార్ధిక్ పాండ్యా ప్రస్తావించకపోవడంపై ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు...

510
Image credit: PTI

2015, 2017, 2019 ఐపీఎల్ టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు హార్ధిక్ పాండ్యా. 2020లో బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. అయితే 2022 సీజన్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కలేదు...

610
Image credit: PTI

రెండు సీజన్లుగా బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టి రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కిరన్ పోలార్డ్‌లను రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. దీంతో మనస్థాపం చెందిన హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా ఎంపికై, తొలి సీజన్‌లో టైటిల్ గెలిచాడు...

710
Rohit Sharma, Hardik Pandya

2014 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని హార్ధిక్ పాండ్యాని ఆ తర్వాతి సీజన్‌లో కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాని సపోర్ట్ చేస్తూ, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణమయ్యాడు. అలాంటి రోహిత్‌ పేరు ప్రస్తావించకపోవడంతో హార్ధిక్ పాండ్యాపై గుర్రుగా ఉన్నారు హిట్ మ్యాన్ అభిమానులు...

810

హార్ధిక్ పాండ్యాని రిటైన్ చేసుకోకుండా ముంబై ఇండియన్స్ మంచి పని చేసిందని, కెప్టెన్ రోహిత్ శర్మపై కనీస గౌరవం లేని ఇలాంటి ప్లేయర్లు... జట్టులో ఉండకపోవడమే మంచిదంటూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు...

910
Image credit: PTI

హార్ధిక్ పాండ్యా లేకుండా ఐపీఎల్ 2022 సీజన్ ఆడిన ముంబై ఇండియన్స్, మొట్టమొదటిసారిగా లీగ్ చరిత్రలో 10 మ్యాచులు ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది... అదే సమయంలో ముంబై నుంచి బయటికి వచ్చిన హార్ధిక్ పాండ్యా, తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు...

1010

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు రోహిత్ శర్మ. అలాంటప్పుడు రోహిత్ శర్మ పేరు ప్రస్తావించకపోవడంపై హిట్ మ్యాన్ ఫీల్ అయితే, టీ20 వరల్డ్ కప్ ఆడే టీమ్‌లో హార్ధిక్ పాండ్యా పేరు ఉండకపోవచ్చని కూడా కొందరు కామెంట్లు చేస్తుండడం కొసమెరుపు... 

Read more Photos on
click me!

Recommended Stories