ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్‌కి జెర్సీని కానుకగా ఇచ్చిన జడ్డూ... వాగన్ ఏం చేశాడంటే...

Published : Aug 31, 2021, 03:59 PM IST

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్, అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు నాలుగు టెస్టుల్లోనూ ఓడి క్లీన్‌స్వీప్ అవుతుందని కామెంట్ చేసిన వాగన్, చాలాసార్లు విరాట్ కోహ్లీని కూడా విమర్శించాడు..

PREV
19
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్‌కి జెర్సీని కానుకగా ఇచ్చిన జడ్డూ... వాగన్ ఏం చేశాడంటే...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా, అనాలసిస్టుగా మారిన మైకెల్ వాగన్‌కి భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, తన జెర్సీని కానుకగా ఇచ్చాడు...

29

మూడో టెస్టులో ధరించిన టీమిండియా జెర్సీని ఛారిటీ కోసం మైకెల్ వాగన్‌కి కానుకగా ఇచ్చాడు జడేజా. ఈ 8 నెంబర్ జెర్సీపై రవీంద్ర జడేజాతో పాటు భారత ఆటగాళ్ల సంతకాలు కూడా ఉన్నాయి. 

39

ఈ జెర్సీని వేలంలో అమ్మి, వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాల కోసం వినియోగించబోతున్నాడు మైకెల్ వాగన్.. జడ్డూ ఇచ్చిన జెర్సీ పిక్‌ని పోస్టు చేసిన మైకెల్ వాగన్, ధన్యవాదాలు తెలుపుతూ స్టోరీ పెట్టాడు.

49

తొలి రెండు టెస్టుల్లో వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు...

59

బౌలింగ్‌లో వికెట్లు తీయకపోయినా బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజా... తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 56, రెండో టెస్టులో 40 పరుగులు చేసి రాణించాడు. 

69

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే అవుటైన జడ్డూ... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు...

79

అయితే మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో లోయర్ ఆర్డర్‌లో 30 పరుగులు చేసి, ఓటమి తేడాను తగ్గించగలిగాడు రవీంద్ర జడేజా...

89

మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రవీంద్ర జడేజా, ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టులో బరలో దిగడం అనుమానంగా మారింది...

99

2018లో ఓవల్‌లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి భారతజట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

click me!

Recommended Stories