జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు... ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ...

Published : Aug 04, 2021, 05:53 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ జట్టు 25 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేయగలిగింది...

PREV
19
జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు... ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ...

ఇంగ్లాండ్‌లో వరుసగా ఏడు టెస్టుల్లో టాస్ ఓడిపోయాడు విరాట్ కోహ్లీ. 2018 ఇంగ్లాండ్ టూర్ నుంచి వరుసగా టాస్ ఓడిపోస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ.

29

అత్యధిక టాస్‌లు ఓడిపోయిన భారత కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. ధోనీ 60 టెస్టుల్లో 34 టెస్టుల్లో టాస్ ఓడిపోగా, విరాట్ కోహ్లీ తన 62 టెస్టుల్లో 35 సార్లు టాస్ ఓడిపోయాడు...

39

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకి తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు జస్ప్రిత్ బుమ్రా. మొదటి ఓవర్‌లో రోరీ బర్న్స వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

49

బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటై పెవిలియన్ చేరాడు రోరీ బర్న్స్. ఇంగ్లాండ్‌ గడ్డ మీద తొలి ఓవర్‌లో వికెట్ తీసిన భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

59

ఇంతకుముందు 2012లో సౌతాఫ్రికా బౌలర్ మోర్నీ మార్కెల్, 2020లో విండీస్ బౌలర్ కిమర్ రోచ్ తర్వాత ఇంగ్లాండ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా...

69

సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్‌ను డొమినిక్ సిబ్లీ, జాక్ క్రావ్లీ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

79

68 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన జాక్ క్రావ్లీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన టీమిండియాకి ఫలితం దక్కింది.

89

సిరాజ్ బౌలింగ్‌లో రెండో బంతికి అవుట్ కోసం రివ్యూ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కలేదు. అయితే ఆ తర్వాత మూడో బంతికి రిషబ్ పంత్ సూచనతో డీఆర్‌ఎస్‌కి వెళ్లాడు కోహ్లీ.

99

రివ్యూలో బ్యాట్‌కి తగులుతున్నట్టు కనిపించడంతో టీమిండియాకి రెండో వికెట్ దక్కింది.
వస్తూనే మూడు బౌండరీలు బాదిన జో రూట్ 10 బంతుల్లో 12 పరుగులు... డొమినిక్ సిబ్లీ 67 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. 

click me!

Recommended Stories