తొలి టెస్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగింది భారత జట్టు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌తో పాటు స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు కల్పించాడు విరాట్ కోహ్లీ...
29
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ని ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
39
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీశాడు రవిచంద్రన్ అశ్విన్. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి దక్కిన రెండు వికెట్లూ అశ్విన్ తీసినవే...
49
ప్రాక్టీస్ కోసం ఇంగ్లీష్ కౌంటీ మ్యాచ్‌లో కూడా ఆడిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. అలాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ను తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది...
59
పిచ్ ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎవ్వరైనా వికెట్లు పడగొట్టడం రవిచంద్రన్ అశ్విన్‌కి అలవాటు. అదీకాకుండా కీలక సమయంలో భాగస్వామ్యాలను విడగొట్టి, టీమిండియాకి బ్రేక్ అందించడం అశ్విన్ స్పెషాలిటీ....
69
అందుకే రవిచంద్రన్ అశ్విన్‌ని ‘మ్యాచ్ విన్నర్’గా పేర్కొంటారు. అయితే అశ్విన్‌ని కాదని, రవీంద్ర జడేజాకి తుదిజట్టులో ప్లేస్ ఇవ్వడానికి వామప్ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ పర్ఫామెన్స్ కారణమని తెలుస్తోంది...
79
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆట్టుకోలేకపోయిన రవీంద్ర జడేజా, ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ స్కోరు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన చోట, కెఎల్ రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
89
అందుకే మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ని కాదని, బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు జడేజాకి ప్లేస్ దక్కి ఉండవచ్చని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
99
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడంలో స్పెషలిస్టు అయిన అశ్విన్ లేకపోవడం టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ దాకా వేచి చూడాల్సిందే...