రెండో టీ20లో శ్రీలంక ఉత్కంఠ విజయం... ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్‌లో...

First Published | Jul 28, 2021, 11:31 PM IST

టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో లంక జట్టు ఉత్కంఠ విజయం అందుకుంది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది లంక జట్టు...

133 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టు, ఆవిష్క ఫెర్నాండో వికెట్ త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్‌కి 1 పరుగు మాత్రమే ఇచ్చిన భువీ, తన రెండో ఓవర్‌లో ఆవిష్కను అవుట్ చేశాడు.
13 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన ఆవిష్క ఫెర్నాండో, భారీ షాట్‌కి ప్రయత్నించగా బౌండరీ లైన్ దగ్గర రాహుల్ చాహార్ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు...

సదీరా సమరవిక్రమ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా, 3 పరుగులు చేసిన ధసున్ శనకను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు...
31 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన మినోద్ భనుక, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి రాహుల్ చాహార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
11 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి దూకుడుగా కనిపించిన వానిండు హసరంగ, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 94 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది శ్రీలంక...
రమేశ్ మెండీస్ 2 పరుగులు చేసి అవుట్ కాగా ధనంజయ డి సిల్వ చివరిదాకా పోరాడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చింది.
సకారియా వేసిన 20వ ఓవర్‌లో వరుసగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఈజీ విజయాన్ని అందుకుంది లంక జట్టు. గత 13 టీ20 మ్యాచుల్లో శ్రీలంకకి ఇది రెండో విజయం.

Latest Videos

click me!