దేవ్‌దత్ పడిక్కల్ రికార్డు ఫీట్... టీమిండియాలో మొట్టమొదటి 21 శతాబ్దపు క్రికెటర్‌గా...

First Published Jul 28, 2021, 8:11 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన దేవ్‌దత్ పడిక్కల్, 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు ఆరంగ్రేటం చేశారు...

కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావడం, అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8 మందిని కూడా ఐసోలేషన్‌కి తరలించడంతో భారత జట్టు 9 మంది ప్లేయర్లు లేకుండా రెండో టీ20 బరిలో దిగుతోంది.శ్రీలంక టూర్‌కి ఎంపికైన 20 మంది ప్లేయర్లలో 9 మంది మిస్ కాగా, మిగిలిన 11 మందితో రెండో టీ20 మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...
undefined
శిఖర్ ధావన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే భారత జట్టులో బ్యాట్స్‌మెన్లు... మిగిలిన ఆరుగురు కూడా బౌలర్లే... దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేయబోతున్నారు...
undefined
వీరిలో నితీశ్ రాణా, చేతన్ సకారియా వన్డేల్లో ఎంట్రీ ఇవ్వగా దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్‌లకు ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్...
undefined
21వ శతాబ్దంలో జన్మించి, భారత జట్టుకి ఆడుతున్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్ పడిక్కల్... మహిళల క్రికెట్‌లో మాత్రం ఇప్పటికే ఐదుగురు క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చారు.
undefined
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్న దేవ్‌దత్ పడిక్కల్, విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో పృథ్వీషా తర్వాత 800+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనతో సెంచరీతో మోత మోగించిన దేవ్‌దత్ పడిక్కల్, 2000వ సంవత్సరంలో జన్మించాడు. పడిక్కల్ పుట్టినరోజు జూలై 7, 2000.
undefined
ఓవరాల్‌గా భారత క్రికెట్‌లో 17 ఏళ్ల సెన్సేషన్ షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్, అయూష్ సోనీ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న 21వ శతాబ్దపు ప్లేయర్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్.
undefined
టీమిండియా తరుపున ఒకే మ్యాచ్‌లో నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ఆరంగ్రేటం చేయడం ఇది రెండోసారి. 2007లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్న, ఆర్‌పీ సింగ్ ఆరంగ్రేటం చేశారు.
undefined
click me!