సిరాజ్‌ సంబరాలు చూసి షాక్ అయ్యాను... మా అనుబంధానికి ఇదే నిదర్శనం... రవిచంద్రన్ అశ్విన్

First Published Feb 16, 2021, 11:21 AM IST

ఇలాంటి పిచ్ తయారుచేస్తారా... ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అసాధ్యం... కావాలనే కసితో ఇలాంటి చెత్త పిచ్‌ను తయారుచేశారు... రెండో టెస్టు జరుగుతున్న చెపాక్ పిచ్‌పై ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు ఇవి. అయితే ఇదే పిచ్‌పై అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై దూకుడుగా బ్యాటింగ్ చేసి, టెస్టుల్లో ఐదో సెంచరీతో ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించాడు.

149 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 106 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన రవిచంద్రన్ అశ్విన్‌, భారత అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు... పిచ్‌పై విమర్శలు చేస్తున్నవారికి ఎలా బ్యాటింగ్ చేయాలో అశ్విన్‌ని చూసి నేర్చుకోవాలంటున్నారు విమర్శకులు...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటుతోనూ రాణించి, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అయితే తన బ్యాటింగ్ మెరుగవ్వడానికి క్రెడిట్ మొత్తం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌దే అంటున్నాడు అశ్విన్.
undefined
‘కొన్నేళ్లుగా నేను సెంచరీ చేయలేకపోయాను. బ్యాటింగ్‌లో రాణించడం లేదని నాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే నా బ్యాటింగ్ మారింది. సిడ్నీ టెస్టులో ఇన్నింగ్స్‌లో నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది...
undefined
అయితే నా బ్యాటింగ్ మెరుగవ్వడానికి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ కారణం. ఆయన ఎన్నో కొత్త టెక్నిక్‌లను నేర్పించి, నా బ్యాటింగ్ మెరుగ్వడానికి సాయపడ్డారు. ఈ సెంచరీ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది...
undefined
చెన్నైలో మ్యాచ్ ఆడడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ అనే మాట చెబితే సరిపోదు... నేను టెస్టుల్లో సెంచరీ చేసినప్పుడు చాలాసార్లు నాతో ఇషాంత్ శర్మ ఉండేవాడు.
undefined
ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ ఉండడంతో కాస్త భయపడ్డాను. సిరాజ్ ఎలా ఆడతాడోనని అనుమానపడ్డాను. అందుకే లైన్‌ను గమనిస్తూ బ్యాటింగ్ చేయమని చెప్పాను... నేను సెంచరీ చేసినప్పుడు సిరాజ్ చేసుకున్న సంబరాలు చూసి షాక్ అయ్యాను...
undefined
నా కంటే ఎక్కువగా సిరాజ్, నా సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్ తోడుగా ఉంటే, ఎంతో సంతోషంగా ఉంటుంది. మా డ్రెస్పింగ్ రూమ్‌లో ఉన్న అనుబంధానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ...
undefined
టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయిన సమయంలో రవిచంద్రన్ అశ్విన్ 78 పరుగులతో ఉన్నాడు. అయితే పదో వికెట్‌కి సిరాజ్‌తో కలిసి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, సెంచరీ పూర్తి చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్...
undefined
అశ్విన్ సెంచరీ పూర్తయ్యే సమయానికి ఈ ఇద్దరూ 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అందులో సిరాజ్ చేసింది ఒకే ఒక్క పరుగు. అశ్విన్ సెంచరీ పూర్తయ్యాక రెండు భారీ సిక్సర్లు బాదాడు మహ్మద్ సిరాజ్...
undefined
‘నీ పైన భరోసా పెట్టి సింగిల్ తీశాను... చూసుకొని ఆడు’ అని సిరాజ్‌తో అశ్విన్ అన్న మాటలు టీవీల్లో స్పష్టంగా వినిపించాయి. ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు సిరాజ్... ఇక వేగంగా ఆడాలని అశ్విన్‌కి సూచించిన సిరాజ్, 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
undefined
click me!