INDvsAUS: మూడో వన్డేలో టీమిండియా ఓదార్పు విజయం... మ్యాక్స్‌వెల్ విధ్వంసం చేసినా...

First Published Dec 2, 2020, 5:01 PM IST

INDvAUS 3rd ODI: మొదటి రెండు వన్డేల్లో ఓటమి తర్వాత జట్టులో మార్పులు చేసిన టీమిండియా... ఎట్టకేలకు ఆసీస్ టూర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్, ఓపెనింగ్ జోడిని విడదీయగా... గత రెండు మ్యాచుల్లో సెంచరీలతో చెలరేగిన స్టీవ్ స్మిత్‌ను తొందరగానే అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్ ఆసీస్ పతనాన్ని శాసించారు. డేంజరస్ మ్యాన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టు విజయాన్ని లాగేసుకున్నంత పని చేసినా కీలక సమయంలో కమ్ బ్యాక్ ఇచ్చిన బుమ్రా అతని అవుట్ చేశాడు. ఎట్టకేలకు బ్యాటింగ్‌లో టాపార్డర్ ఫెయిల్ అయినా హార్ధిక్, జడేజా, కోహ్లీ వల్ల మంచి స్కోరు చేయగలిగిన ఆస్ట్రేలియా, బౌలర్లు రాణించడంతో లక్ష్యాన్ని కాపాడుకుని క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. 303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్, 289 పరుగులకు  ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 13 పరుగుల తేడాతో విజయం దక్కింది.

303 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 25 పరుగుల వద్ద లబుషేన్ వికెట్ కోల్పోయింది. వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన నటరాజన్, లబుషేన్ 7 పరుగులకే పెవిలియన్ చేర్చాడు.
undefined
సైనీ స్థానంలో ఆరంగ్రేటం చేసిన నటరాజన్... మెయిడిన్ వికెట్ ఓవర్‌తో ఎంట్రీని ఘనంగా ప్రారంభించాడు.
undefined
7 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్మిత్...
undefined
இதையடுத்து, முதல் 2 போட்டிகளிலும் சதமடித்த ஸ்மித்தை 7 ரன்களில் ஷர்துல் தாகூர் வீழ்த்த, ஃபின்ச்சும் மோய்ஸஸ் ஹென்ரிக்ஸும் இணைந்து ஆடிவருகின்றனர்.
undefined
ఆ తర్వాత ఆరోన్ ఫించ్, హెండ్రిక్స్ కలిసి మూడో వికెట్‌కి 61 పరుగులు జోడించారు. 22 పరుగులు చేసిన హెండ్రిక్స్‌ని కూడా శార్దూల్ ఠాకూర్‌ పెవిలియన్ చేర్చాడు...
undefined
ఓ వైపు వికెట్లు పడుతున్నా హాఫ్ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ ఆరోన్ ఫించ్...
undefined
82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
21 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు రవీంద్ర జడేజా...
undefined
ఆ తర్వాత ఆలెక్స్ క్యారీ 42 బంతుల్లో 38 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...
undefined
అయితే ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ మరోసారి భారత బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
undefined
నటరాజన్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టిన మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు...
undefined
ఆస్టన్ అగర్, మ్యాక్స్‌వెల్ కలిసి ఏడో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
అబ్బాట్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో 278 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది ఆసీస్...
undefined
28 బంతుల్లో 28 పరుగులు చేసిన అగర్‌ను అవుట్ చేసిన నటరాజన్... ఆసీస్‌ తొమ్మిదో వికెట్‌ను పడగొట్టాడు.
undefined
రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో హజల్ వుడ్, ఆడమ్ జంపా బౌండరీలు కొట్టలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సిన దశలో బుమ్రా, ఆడమ్ జంపాను అవుట్ చేయడంతో 289 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా.
undefined
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, మొదటి వన్డే ఆడుతున్న నటరాజన్ 2 వికెట్లు తీశాడు. బుమ్రా రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది.
undefined
click me!