ఆసియా క‌ప్ 2024 సెమీ ఫైనల్ లో టీమిండియా సూప‌ర్ బౌలింగ్.. వికెట్లు ఎగిరిపడ్డాయి

First Published | Jul 26, 2024, 4:06 PM IST

Asia Cup 2024 semi-final : ఆసియా క‌ప్ 2024 తొలి సెమీ ఫైన‌ల్ లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 80 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. 
 

Asia Cup 2024 semi-final : ఆసియా క‌ప్ 2024 లో భార‌త మ‌హిళ క్రికెట్ జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ముందుకు సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో సెమీ ఫైన‌ల్ కు చేరిన భార‌త జ‌ట్టు తొలి సెమీస్ లో బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డింది. 

శ్రీలంక‌లోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ లో అద‌ర‌గొట్టారు. వ‌రుస వికెట్లు తీసుకుంటూ బంగ్లాదేశ్ ను బిగ్ స్కోర్ చేయ‌కుండా అడ్డుకున్నారు. 

Latest Videos


ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ నిర్ణ‌యం బంగ్లాదేశ్ కు భారీ షాకిచ్చింది. ఆట ఆరంభం నుంచే భారత బౌల‌ర్లు సూప‌ర్ బౌలింగ్ తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు షాకిస్తూనే ఉన్నారు. 

మొద‌టి ఓవ‌ర్ నాలుగో బంతికే రేణుకా సింగ్ బంగ్లా ఓపెనింగ్ బ్యాట‌ర్ దిలార అక్త‌ర్ ను ఔట్ చేశారు. ఈ మ్యాచ్  మొత్తం మంచి బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన రేణుకా ఠాకూర్ సింగ్ మొత్తం మూడు వికెట్లు తీసుకున్నారు. 

అలాగే, భార‌త బౌల‌ర్ల‌లో రాధా యాదవ్ కూడా మ‌రోసారి బాల్ తో మెరిశారు. కీల‌క‌మైన మూడు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ టీమ్ కు షాకిచ్చింది. 

India Women vs Bangladesh Women, India ,

కీలకమైన ఈ సెమీస్ మ్యాచ్ లో రేణుకా సింగ్ 3, రాధా యాదవ్ 3 వికెట్లు తీసుకున్నారు. వీరికి తోడుగా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. 
 

భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాటర్లలో వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. 

click me!