Mohammed Shami
Mohammed Shami: ప్రస్తుతం చీలమండ గాయంతో జట్టుకు దూరమైన ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.
Mohammed Shami
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో తన పునరావాసం బాగానే జరుగుతోందనీ, ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపికయ్యేందుకు అందుబాటులో ఉంటానని అర్జున అవార్డు అందుకోవడానికి ముందు షమీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
shami 1
'నా పునరావాసం బాగానే ఉంది, నా పురోగతిపై ఎన్సీఏలోని వైద్య నిపుణులు సంతోషంగా ఉన్నారు. నా చీలమండలో కొద్దిగా నొప్పి ఉంది కానీ, అది బాగానే ఉంది. నేను నా శిక్షణా సెషన్లను ప్రారంభించాను. ఇంగ్లాండ్ సిరీస్ లో నేను పునరాగమనం చేయగలనని నేను నమ్ముతున్నాను. నా పునరాగమనమే ఈ సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నా' అని 33 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ పేర్కొన్నాడు.
Mohammad Shami
జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కు షమీ దూరమయ్యాడు. అలాగే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ నుంచి కూడా విశ్రాంతి నిచ్చింది బీసీసీఐ. అయితే, ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
mohd shami
కేప్ టౌన్ లో సౌతాఫ్రికాపై రెంటో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయంపై స్పందించిన మహ్మద్ షమీ.. 'రెండో టెస్టులో మేం బాగా ఆడాం.. అందరూ రాణించారు.. మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. భారత్ అద్భుత పునరాగమనం చేసి సిరీస్ ను సమం చేసింది. దురదృష్టవశాత్తు, గాయం కారణంగా నేను టెస్టులో భాగం కాలేకపోయాను. కానీ నేను వీలైనంత త్వరగా క్రికెట్ లోకి తిరిగి రావాలనుకుంటున్నాను. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో నేను మళ్లీ ఆడగలనని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, తన ప్రస్తుత భారత పేస్ త్రయంపై ప్రశంసల జల్లు కురిపించిన షమీ.. 'ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ అటాక్ లలో మనది ఒకటని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. వన్డే వరల్డ్ కప్ సమయంలో మీరు చూశారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో రెండో టెస్టులో జస్ప్రీత్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసరడానికి మా పేస్ అటాక్ సరిపోతుందని నేను చెప్పగలను' అని షమీ పేర్కొన్నాడు.
Mohammed Shami
కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో సంచలన బౌలింగ్ చేసిన షమీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిఫారసు చేసింది. ఐసీసీ 2023 వరల్డ్ కప్ లో షమీ 7 మ్యాచ్ లో 3 ఐదు వికెట్లతో సహా 24 వికెట్లు పడగొట్టాడు.