Mohammed Shami
Mohammed Shami on Arjuna Award: టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ అర్జున అవార్డు అందుకున్నాడు. ఇది తన జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ గా షమీ పేర్కొన్నాడు. దీంతో ఒక కల నెరవేరిందని తెలిపాడు.
Mohammed Shami
అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో సంచలన బౌలింగ్ చేసిన షమీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిఫారసు చేసింది.
Mohammed Shami
ఈ టోర్నీలో 7 మ్యాచ్ లో 3 ఐదు వికెట్లతో సహా 24 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ ఫైనల్ వరకు భారత ప్రయాణం చేయడంలో అతను చేసిన కృషికి గాను భారత క్రికెట్ అత్యున్నత సంఘం అతనికి బహుమతి ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ షమీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపారు.
Mohammed Shami
అర్జున అవార్డు అందుకోవడంపై షమీ హర్షం వ్యక్తం చేశాడు. 'ఈ క్షణాలను వివరించడం కష్టం. కష్టపడితే కలలు నిజమవుతాయని మాత్రమే చెప్పగలను. ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం, నా కృషి ఫలితం' అని మహ్మద్ షమీ తెలిపాడు.
Mohammed Shami
ఇక, గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగే రెండు టెస్టులకు కూడా అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకా బౌలింగ్ ప్రారంభించని ఈ వెటరన్ తన ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Mohammed Shami
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. దీనిపై మహ్మద్ షమీ స్పందిస్తూ.. 'రెండు పెద్ద టోర్నమెంట్లు వస్తున్నందున ఫిట్ గా ఉండటమే నా లక్ష్యం. ముఖ్యమైన టెస్టు సిరీస్ లు కూడా ఉన్నాయి. నా నైపుణ్యాల గురించి నేను ఆందోళన చెందడం లేదు' అని తెలిపాడు.