మిథాలీరాజ్ ఖాతాలో మరో రికార్డు... వుమెన్స్ క్రికెట్ వరల్డ్‌కి మకుటం లేని మహారాణిలా...

Published : Mar 12, 2021, 03:17 PM IST

భారత బ్యాటింగ్ క్వీన్ మిథాలీరాజ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి పది వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళగా, మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది మిథాలీ. 

PREV
18
మిథాలీరాజ్ ఖాతాలో మరో రికార్డు... వుమెన్స్ క్రికెట్ వరల్డ్‌కి మకుటం లేని మహారాణిలా...

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 50 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన మిథాలీ, టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో 10 వేల మైలురాయిని చేరుకుంది...

28

2002లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన మిథాలీరాజ్, 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన రెండో భారత క్రికెటర్‌గానూ నిలిచింది. 

38

సచిన్ టెండూల్కర్ మాత్రమే మిథాలీరాజ్ కంటే ముందున్నాడు. మిథాలీ మరో ఆరు నెలలు క్రికెట్ ఆడితే, ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా సచిన్ రికార్డును కూడా చెరిపేస్తుంది. 

48

వన్డేల్లో 6,974 పరుగులు చేసిన మిథాలీరాజ్, మరో 36 పరుగులు చేసి 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటుంది. వన్డేల్లో ఈ ఫీట్ అందుకోబోతున్న మొట్టమొదటి క్రికెటర్ మిథాలీరాజ్... 6 వేల మైలురాయి దాటిన మొదటి మహిళఆ క్రికెటర్ కూడా మిథాలీయే..

58

వన్డేల్లో ఏడు సెంచరీలతో పాటు 54 హాఫ్ సెంచరీలు చేసిన మిథాలీరాజ్, వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

68

టీ20ల్లో 89 మ్యాచులు ఆడిన మిథాలీరాజ్, 2,364 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. టీ20ల్లో మిథాలీ ఖాతాలో 17 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. 

78

అంతేకాకుండా వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక మహిళా క్రికెటర్, 200 వన్డేలు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్... ఇలా అనేక రికార్డులు మిథాలీరాజ్ పేరిట ఉన్నాయి...

88

వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు, వరుసగా అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన వుమెన్ క్రికెటర్‌గా ఉన్న మిథాలీరాజ్‌ని ‘లేడీ సచిన్’ అని కూడా ముద్దుగా పిలుస్తారు...
 
click me!

Recommended Stories