సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా... రెండో వన్డేలో అద్భుత విజయం...

First Published Mar 9, 2021, 3:30 PM IST

దక్షిణాఫ్రికా చేతిలో మొదటి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత మహిళల జట్టు, రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకుంది. లక్నోలోని అటల్ బీహఆర్ ఎకనా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

41 ఓవర్లలో 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. లారా గుడ్‌ఆల్ 49 పరుగులు చేయగా కెప్టెన్ సునే లూస్ 36 పరుగులకి అవుట్ అయ్యింది.
undefined
భారత బౌలర్లలో సీనియర్ పేసర్ జులన్ గోస్వామి 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్ 3, మన్సీ జోషీ 2, హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ వికెట్ తీశారు.
undefined
28.4 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా చేధించింది టీమిండియా. యంగ్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ 9 పరుగులకే త్వరగా అవుటైంది. అయితే స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, పూనమ్ రౌత్ 89 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు.
undefined
వన్డేల్లో లక్ష్య చేధనలో వరుసగా 10 సార్లు 50+ స్కోర్ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది స్మృతి మంధాన... ఏ పురుష క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
undefined
అంతర్జాతీయంగా అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది భారత సారథి మిథాలీరాజ్. మిథాలీరాజ్‌కి ఇది 310 వన్డే కాగా, మూడో స్థానంలో ఉన్న జులన్ గోస్వామికి 262వ వన్డే...
undefined
click me!