ఇక్కడికొచ్చాక 5 కిలోలు తగ్గాను, కడుపునొప్పితోనే ఆడాం... సంచలన విషయాలు బయటపెట్టిన బెన్ స్టోక్స్

First Published Mar 9, 2021, 2:43 PM IST

తొలి టెస్టులో భారీ విజయం తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి, టెస్టు సిరీస్‌ను అలాగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే టెస్టు సిరీస్ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టాడు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్...

చెన్నైలో మొదటి రెండు టెస్టులు ఆడిన ఇండియా, ఇంగ్లాండ్ జట్లు, ఆ తర్వాతి రెండు టెస్టులను మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడి ఎండ కారణంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారట...
undefined
‘అహ్మదాబాద్‌లో ఎండ తీవ్రంగా ఉంది. దాదాపు 41 డిగ్రీల వేడిలో ఆడాల్సి రావడంతో మాలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు... అయినా వాటిని లెక్కచేయకుండా గేమ్ మీద ఉన్న కమ్మిట్‌మెంట్‌తో ఆటను కొనసాగించాం...
undefined
నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు ఒక్క వారంలోనే నేను 5 కిలోల బరువు తగ్గాను, డామ్ సిబ్లీ 4 కిలోలు తగ్గాను. జిమ్మీ అండర్సన్ మూడు కిలోల దాకా తగ్గాను. మిగిలిన ప్లేయర్లు కూడా బరువు తగ్గారు....
undefined
జాక్ లీచ్ అయితే బౌలింగ్ స్పెల్స్ మధ్యలో మైదానం వదిలి, టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడిపేవాడు... ఎండ వేడిని తట్టుకోలేక, అక్కడ చల్లగా ఉంటుందని సేదతీరేవాడు...’ అంటూ తమ సమస్యలను చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.
undefined
‘ఓటమి తర్వాత సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. ప్రతీ ఒక్కరూ ఆడాలనే ఇక్కడికి వచ్చాం. టీమిండియా, రిషబ్ పంత్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు....
undefined
అయితే గెలుపు కోసం ఆఖరిదాకా చేయాల్సిదంతా చేసినా ఇంగ్లాండ్ ప్లేయర్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే... మాలో చాలామందికి ఇదే మొదటి ఇండియా టూర్...
undefined
ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ టూర్ ప్రభావం ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్లపైన పడకూడదు. ఈ సిరీస్‌లో సరిగా ఆడలేనందుకు బాధతో ఓల్లీ పోప్, జాక్ క్రావ్లే, డామ్ సిబ్లీ లాంటి ప్లేయర్లు మళ్లీ ఇక్కడికి వచ్చేందుకు భయపడకూడదని అనుకుంటున్నా...
undefined
వారిలో మంచి సత్తా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే వారు మంచి నైపుణ్యం కలిగిన ప్లేయర్లుగా మారతారు...’ అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్...
undefined
‘ఆఖరి టెస్టు ఆరంభానికి ముందు మాలో కొందరికి కడుపు నొప్పి వచ్చింది. దీంతో ప్లేయర్లను టెస్టు ఆరంభానికి ముందు ఫిట్‌గా ఉంచేందుకు మేనేజ్‌మెంట్ మరింతగా కష్టపడాల్సి వచ్చింది... అందులోనూ అహ్మదాబాద్ హీట్ వామ్మో...’ అంటూ వివరించాడు బెన్ స్టోక్స్.
undefined
click me!