ఇంతలో ఎంత మార్పు... వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టిన రిషబ్ పంత్...

Published : Feb 16, 2021, 03:33 PM IST

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆసీస్ టూర్‌లో బ్యాటుతో రాణించినా, వికెట్ కీపింగ్‌లో మాత్రం పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచులను జారవిరచడంతో పాటు ఈజీ స్టంపింగ్ అవకాశాలను కూడా నేలజార్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో లోపాలు కనిపించాయి. అయితే రెండో టెస్టులో మాత్రం పంత్ పర్ఫామెన్స్ అదిరిపోయింది...

PREV
16
ఇంతలో ఎంత మార్పు... వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టిన రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓల్లీ పోప్, జాక్ లీచ్‌ల అవుట్ చేసేందుకు కళ్లు చెదిరే క్యాచులు అందుకున్నాడు రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినా ఆ లోటుని వికెట్ కీపింగ్‌తో భర్తీ చేశాడు రిషబ్ పంత్...

26

నాలుగో రోజు ఆట ప్రారంభమైన తర్వాత 26 పరుగులతో ఆకట్టుకుంటున్న డానియల్ లారెన్స్‌ను అవుట్ చేసేందుకు మెరుపు వేగంతో వికెట్ల వెనకాల కదిలాడు రిషబ్ పంత్. అశ్విన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయి, స్టంపౌట్ అయ్యాడు లారెన్స్...

36

లారెన్స్ క్రీజు బయటికి వచ్చి బ్యాటింగ్ చేస్తుండడాన్ని గమనించిన రిషబ్ పంత్, బౌలింగ్‌ చేయడానికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడి, ఎలా బాల్ వేయాలో చెప్పాడు. చెప్పినట్టే మెరుపు వేగంతో కదిలి డైవ్ చేస్తూ, వికెట్లను గిరాటేశాడు...

46

ఆఖర్లో 18 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేసిన మొయిన్ ఆలీని కూడా ఇదే విధంగా పెవిలియన్ చేర్చాడు రిషబ్ పంత్... కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు మొయిన్ ఆలీ...

56

‘ఆసీస్ టూర్ తర్వాత రిషబ్ పంత్ చాలా కష్టపడ్డాడు. గ్లవ్స్‌తో అతను కదులుతున్న తీరును చూస్తే, పంత్‌ వికెట్ కీపింగ్‌లో ఎంత మెరుగయ్యాడో అర్థం చేసుకోవచ్చు. దీని కోసం అతను భారీగా బరువు తగ్గి, ఎంతో శ్రమించాడు. ఆ ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది...

66

అతను ఇలాగే మ్యాచ్, మ్యాచ్‌కీ మెరుగవ్వాలని మేం కోరుకుంటున్నాం... జట్టులో అతని స్థానం చాలా విలువైనది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ..
 
click me!

Recommended Stories