మొదటి టెస్టులో షాబజ్ నదీం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో అతన్ని పక్కనబెట్టిన విరాట్ కోహ్లీ, అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. అలాగే బ్యాటుతో రాణించినా, బాల్‌తో వికెట్లు తీయలేకపోయిన సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

చివరిగా 2019లో టెస్టు మ్యాచ్ ఆడిన కుల్దీప్ యాదవ్, రెండేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. 2019 సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, ఆస్ట్రేలియా పతనాన్ని శాసించిన కుల్దీప్, 13 టెస్టు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

న్యూజిలాండ్ టూర్‌తో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కి ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం దక్కలేదు. సీనియర్ స్పిన్నర్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాటుతోనూ, బాల్‌తోనూ రాణిస్తుండడంతో కుల్దీప్ యాదవ్, రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...

ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఈ ఇద్దరూ గాయాల కారణంగా బరిలో దిగకపోయినా కుల్దీప్ యాదవ్‌కి బదులుగా వాషింగ్టన్ సుందర్‌ని ఆడించింది టీమిండియా. అతను మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి, తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీసి రాణించిన సంగతి తెలిసిందే...

అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ని ఆడించినా అతనికి ఎక్కువగా ఓవర్లు వేసే అవకాశం దక్కలేదు. ఓ వైపు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్... ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతూ వికెట్లు తీస్తుండడంతో ఆ ఇద్దరినే కొనసాగించిన విరాట్, మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్‌తో కేవలం 6 ఓవర్లు మాత్రమే వేయించాడు...

రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 ఓవర్లు ముగిసిన తర్వాత చివరి బౌలింగ్ ఆప్షన్‌గా కుల్దీప్ యాదవ్‌కి బంతి దక్కింది. ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్న కుల్దీప్ యాదవ్, తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో రాణించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌ను అవుట్ చేశాడు. కుల్దీప్ యాదవ్‌కి రెండేళ్ల తర్వాత దక్కిన తొలి వికెట్ అది...

వికెట్ దక్కగానే ఆనందంగా చిరునవ్వులు చిందించిన కుల్దీప్ యాదవ్‌ను రోహిత్ శర్మ పైకెత్తుకుని కౌగిలించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ పడిన మనోవేదనకి మందుగా దక్కిన వికెట్ అది... ఆ తర్వాత ఐదు సిక్సర్లతో 43 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

రెండు వికెట్లు తీసినా అహ్మదాబాద్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కుతుందా? అనేది అనుమానమే... ఎందుకంటే అక్షర్ పటేల్, అశ్విన్ అద్భుతంగా రాణించారు. వారికి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం వచ్చింది, ఎక్కువ వికెట్లూ తీశారు.

కానీ కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టాలనే అతనికి తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా, కావాలనే అతనికి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం ఇవ్వలేదని అనుమానిస్తున్నారు అభిమానులు.

కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు కాబట్టి అతని స్థానంలో బ్యాటుతోనూ రాణించగల వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం దక్కొచ్చు. ఇప్పటికే పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు వాషింగ్టన్ సుందర్.

సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో జో రూట్‌ను అవుట్ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్న కుల్దీప్ యాదవ్, అహ్మదాబాద్‌తో జరిగే మూడో టెస్టులోనూ ఆడే అవకాశాన్ని జారవిడుచుకున్నాడంటూ ట్వీట్లు చేస్తున్నారు అభిమానులు. ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే మూడో టెస్టులో కుల్దీప్‌కి చోటు ఉంటుందో లేదో తెలియాలంటే అప్పటిదాకా వేచి చూడాల్సిందే.