కామెంటేటర్‌గా మారిన దినేశ్ కార్తీక్... వికెట్ కీపర్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా...

First Published May 27, 2021, 12:53 PM IST

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటికే ‘ది హండ్రెడ్’ ఆరంభ సీజన్‌కి వ్యాఖ్యతగా దినేశ్ కార్తీక్ వ్యవహారంచబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది స్కై స్పోర్ట్స్. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహారించడం ఖాయంగా మారింది.

భారత మాజీ క్రికెటర్, సీనియర్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి దినేశ్ కార్తీక్ కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున కామెంటరీ ప్యానెల్‌లో ఉండేది ఈ ఇద్దరే...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి కూడా దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహారించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20, వన్డే సిరీస్‌కి వ్యాఖ్యతగా వ్యవహారించాడు దినేశ్ కార్తీక్.
undefined
టీమిండియా తరుపున మొత్తంగా 152 మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా ఆశించినన్ని అవకాశాలు అందుకోలేకపోయాడు. ఎమ్మెస్ ధోనీ స్థానం జట్టులో పదిలం కావడంతో అప్పుడప్పుడూ జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు డీకే.
undefined
26 టెస్టులు ఆడిన దినేశ్ కార్తీక్, ఓ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలు చేశాడు. 94 వన్డేల్లో 9 హాఫ్ సెంచరీలతో 1752 పరుగులు చేశాడు. 32 టీ20 మ్యాచుల్లో 399 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్‌లో కేకేఆర్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.
undefined
టీ20 మ్యాచుల్లో వీరేంద్ర సెహ్వాల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే బెటర్ స్టైయిక్ రేటు కలిగిన దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో మంచి రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లో రెండేసి హాఫ్ సెంచరీలు బాదిన దినేశ్ కార్తీక్, వీరేంద్ర సెహ్వాగ్, కెఎల్ రాహుల్, గంభీర్ కంటే మెరుగైన రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
పార్థివ్ పటేల్ నిరాశపర్చిన తర్వాత అతని స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎమ్మెస్ ధోనీ రాకతో దినేశ్ కార్తీక్, కేవలం ఓ రిప్లేస్‌మెంట్ ఆప్షన్‌గా మిగిలిపోయాడు.
undefined
ధోనీ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్, గంభీర్... ఇలా జట్టులో ఎవరు గాయపడినా దినేశ్ కార్తీక్‌కి అవకాశం దక్కేది. ఓపెనర్‌ నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, ఫినిషర్‌గా కూడా రాణించిన దినేశ్ కార్తీక్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి 2019 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
undefined
2020 మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్, ఐపీఎల్‌లో ఢిల్లీ, పంజాబ్, ముంబై, బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకి కూడా ఆడాడు.
undefined
click me!