వన్డేలే కాదు, టెస్టులదీ అదే పరిస్థితి... దాని కంటే క్వాలిటీ ముఖ్యమంటున్న రవిశాస్త్రి...

Published : Jul 23, 2022, 06:40 PM ISTUpdated : Jul 23, 2022, 06:43 PM IST

టీ20లకు క్రేజ్ పెరుగుతుండడంతో వన్డేలకు చెప్పుకోదగ్గ ఆదరణ దక్కడం లేదు. ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా 50 ఓవర్ల పాటు సాగింది లేదు. ఈ సిరీస్ తర్వాత బెన్ స్టోక్స్, వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో వన్డే ఫార్మాట్ మనుగడపై పెద్ద చర్చే జరుగుతోంది...

PREV
16
వన్డేలే కాదు, టెస్టులదీ అదే పరిస్థితి... దాని కంటే క్వాలిటీ ముఖ్యమంటున్న రవిశాస్త్రి...

2008కి ముందు టెస్టుల కంటే ఎక్కువగా వన్డే ఫార్మాట్‌కే క్రేజ్ ఉండేది. అయితే ఐపీఎల్ ఎంట్రీతో టీ20 ఫార్మాట్‌కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు వన్డే సిరీస్‌ల కంటే టీ20 సిరీస్‌లు ఆడేందుకు బోర్డులు ఆసక్తి చూపిస్తున్నాయి...

26
Image credit: Getty

ఒకప్పుడు యేటా 40-50 వన్డేలు ఆడిన టీమిండియా, ఇప్పుడు పట్టుమని 10 వన్డేలు కూడా ఆడడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు...

36
Usman Khawaja

తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా కూడా వన్డేల మనుగడపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ‘చూస్తుంటే వన్డే క్రికెట్‌ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్లేయర్లు కూడా ఈ ఫార్మాట్ ఆడడానికి ఆసక్తి చూపించడం లేదు. వన్డే వరల్డ్ కప్ ఒక్కటే ఈ ఫార్మాట్‌ని కొనఊపిరితో నిలపగలుగుతోంది... ’ అంటూ కామెంట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా...

46

భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం వన్డేలతో పాటు టెస్టు క్రికెట్ మనుగడపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు... ‘వన్డేలు, టీ20లతో పోలిస్తే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. టీ20లు ఆడే ప్రతీ టీమ్, టెస్టులు ఆడలేదు. టెస్టులకు ఉండాల్సిన స్థాయి వేరు, స్టాండెడ్ వేరు...

56

టెస్టుల విషయంలో క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ముఖ్యం. టాప్ 6 టీమ్స్‌కి మాత్రమే టెస్టులను అవకాశం కల్పించాలి. అప్పుడే టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌లు చూసేందుకు వీలుంటుంది...

66

చిన్న చిన్న జట్లతో పోటీపడే మ్యాచులు అసలు టెస్టు మ్యాచులుగా కాకుండా చూసేవారి సహనానికి టెస్టు పెడుతున్నాయి. ఇది టెస్టు క్రికెట్‌కి చాలా ప్రమాదకరం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!

Recommended Stories