ఎంట్రీ అదిరింది.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ...

Published : Jul 23, 2022, 05:54 PM IST

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కుర్రాళ్లు, తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో మెప్పించారు.  ఓ వైపు సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా, సుసెక్స్ క్లబ్ తరుపున పరుగుల ప్రవాహం సృష్టిస్తుంటే... మరో వైపు నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్  తొలి ఎడిషన్‌లోనే ఆకట్టుకుంటున్నారు...

PREV
17
ఎంట్రీ అదిరింది.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ...
Washington Sundar

లంకాషైర్ క్లబ్ తరుపున కౌంటీల్లో ఆరంగ్రేటం చేసిన వాషింగ్టన్ సుందర్, రెండో బంతికే వికెట్ పడగొట్టి మ్యాజిక్ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 76 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు వాషింగ్టన్ సుందర్...

27

తొలి ఇన్నింగ్స్‌లో లంకాషైర్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన వాషింగ్టన్ సుందర్, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. 10 బంతులు ఆడిన సుందర్, 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు....

37

రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ వికెట్లేమీ తీయలేకపోయాడు. అయితే బెయిలీ 4, విల్ విలియమ్స్ 5 వికెట్లు తీయడంతో 174 పరుగులకి ఆలౌట్ అయ్యింది నార్తింగ్టన్...

47

278 పరుగుల లక్ష్యఛేదనలో 209 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది లంకాషైర్. 69 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్, 81 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసి లంకాషైర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

57
Navdeep Saini

కెంట్ క్లబ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన నవ్‌దీప్ సైనీ, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. బౌలింగ్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి 4 మెయిడిన్లతో 5 వికెట్లు తీశాడు నవ్‌దీప్ సైనీ. తన బౌలింగ్‌లో 14 నో బాల్స్ వేసిన నవ్‌దీప్ సైనీ, 72 పరుగులిచ్చి సమర్పించి, కెంట్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు...

67

రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన నవ్‌దీప్ సైనీ, బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. కెంట్ కౌంటీ తరుపున ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా నిలిచాడు నవ్‌దీప్ సైనీ...

77

ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కెంట్ క్లబ్ తరుపున ఆడి 4 వికెట్లు పడగొట్టగా నవ్‌దీప్ సైనీ 7 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు.. 

click me!

Recommended Stories