మనల్ని ఎవడ్రా ఆపేది! పాపులారిటీలో విరాట్ కోహ్లీయే టాప్, తర్వాతి ప్లేస్‌లో ఎమ్మెస్ ధోనీ...

First Published Jul 23, 2022, 3:22 PM IST

గత రెండు నెలలుగా మాజీ క్రికెటర్లు అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ గురించే మాట్లాడారు. రోహిత్ శర్మతో పాటు కేన్ విలియంసన్ వంటి క్రికెటర్లు కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నా విరాట్ గురించే ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం అతనికి ఉన్న క్రేజ్... ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు విరాట్ గురించి మాట్లాడుతూ యూట్యూబ్ వీడియోలు చేశారు మాజీలు...

పరుగులు చేయలేకపోతున్నా విరాట్ కోహ్లీ పాపులారిటీ, క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పైపెచ్చు రోజురోజుకీ మరింత పెరుగుతోంది. తాజాగా జూన్ నెలకు గానూ మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్‌ పర్సన్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...

ఓర్మాక్స్ స్పోర్ట్స్ స్టార్స్ జూన్ 2022 నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ఇండియా టాప్ 10 లిస్టు విడుదల చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ టాప్‌ ప్లేస్‌ని దక్కించుకున్నాడు...

Latest Videos


అంతర్జాతీయ క్రికెట్‌కి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఈ లిస్టులో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు...

Image Credit: Getty Images (File Photo)

వరల్డ్ ఫుట్‌బాల్ లెజెండ్, పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో... విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు...

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని 8 ఏళ్లు దాటుతున్నా... జనాల్లో అతని పాపులారిటీలో మాత్రం మార్పు రాలేదు. జూన్ 2022 నెలలో ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్‌ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు సచిన్ టెండూల్కర్...

విరాట్ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ... సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు... 

అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్టులో టాప్ 6 ప్లేస్ దక్కింది... టాప్ 10లో చోటు దక్కించుకున్న విదేశీ ప్లేయర్లలో రొనాల్డో, మెస్సీ మాత్రమే ఉన్నారు...

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, ఈ వారంలో సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇండియాలో ఏడో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్‌గా నిలిచింది సింధు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి... టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... పీవీ సింధు తర్వాతి పొజిషన్‌లో నిలిచాడు..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి ఇండియాలో మోస్ట్ పాపులర్ క్రీడాకారుల లిస్టులో టాప్ 9 పొజిషన్ దక్కింది. ఈ సీజన్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కి వీడ్కోలు పలకబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది సానియా మీర్జా...

గాయం కారణంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ టూర్‌లకు దూరమైన స్టార్ ప్లేయర్ కెఎల్ రాహుల్... టాప్ 10 ప్లేస్‌ని దక్కించుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టిని కెఎల్ రాహుల్ వివాహం చేయబోతున్నాడనే వార్త తెగ వైరల్ అవుతోంది... 

click me!