ఇండియాలో ఫుట్‌బాల్‌కి క్రేజ్ రావాలంటే విరాట్ కోహ్లీలాంటి వాళ్లు రావాలి...

First Published | Dec 18, 2020, 1:47 PM IST

భారతదేశంలో ఫుట్‌బాల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది...

 విరాట్ కోహ్లీ లాంటి క్రికెట్ సూపర్ స్టార్స్ ఇండియాలో ఉన్నారు...

ఐఎస్‌ఎల్‌ను ఉపయోగించి, అలాంటి సూపర్ స్టార్స్‌ను ఫుట్‌బాల్ కోసం తయారుచేయాలి...

ఆస్ట్రేలియా లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ టిమ్ కహిల్..

ఇండియాలో ఫుట్‌బాల్‌కి ఇప్పుడంటే క్రేజ్ లేదు కానీ... స్వాతంత్య్రంవచ్చిన కొత్తలో సీన్ వేరేగా ఉండేది.
1948లో ఒలింపిక్స్‌లో సరైన బూట్లు కూడా లేకుండా బరిలో దిగిన భారత ఫుట్‌బాల్ జట్టు, 1956లో నాలుగో స్థానంలో నిలిచింది.

1951, 1962 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ సాధించిన భారత ఫుట్‌బాల్ టీమ్, 1964 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే దేశంలో హాకీ ఆటకి ఆదరణ తగ్గినట్టే ఫుట్‌బాల్‌కి ఏ మాత్రం ఆదరణ దక్కడం లేదు.
దీనికి కారణం భారత ఫుట్‌బాల్ జట్టు ప్రదర్శనే. భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మినహా, మరో ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు తెలీదు చాలామంది భారతీయులకి.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే భారత ఫుట్‌బాల్ టీమ్‌కి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు కావాలని అంటున్నాడు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లెజెండ్ టిమ్ కహిల్.
‘భారతదేశంలో ఫుట్‌బాల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఫుట్‌బాల్ మ్యాచులు చూసేందుకు చాలా దూరం ప్రయాణించడానికి కూడా వాళ్లు వెనకాడరు. క్రికెట్‌కి అక్కడ చాలా క్రేజ్ ఉంది.
విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్స్ ఇండియాలో ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ ద్వారా అలాంటి సూపర్ స్టార్స్‌కి ఫుట్‌బాల్‌లో క్రియేట్ చేయాలి.
వాళ్లతో జాతీయ ఫుట్‌బాల్ జట్టును నిర్మించాలి... అది జరిగితే భారత ఫుట్‌బాల్ టీమ్ అద్భుతాలు చేస్తుంది’... అంట వ్యాఖ్యానించాడు టిమ్ కహిల్.
ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 104వ ర్యాంకులో ఉంది టీమిండియా. 2015లో 173వ ర్యాంకుకి పడిపోయిన భారత ఫుట్‌బాల్ టీమ్, 1996లో అత్యుత్తమంగా 94వ ర్యాంకుకి ఎగబాకింది.

Latest Videos

click me!