WI vs IND: మియామి బీచుల్లో మునిగితేలుతున్న టీమిండియా క్రికెటర్లు.. బికినీ అందాలను ఆస్వాదిస్తూ..

First Published Aug 5, 2022, 2:04 PM IST

WI vs IND T20I: వెస్టిండీస్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. మూడు టీ20లు ముగించుకుని మిగిలిన రెండు మ్యాచులు ఆడేందుకు అమెరికా చేరుకుంది. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్లు మియామి బీచుల్లో మునిగితేలుతున్నారు. 

‘మియామి బీచుల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా.. మినిమం బికినీలల్లో ఇక మోతరా...’ అంటూ అమెరికాలోని మియామి బీచ్ గురించి వర్ణిస్తూ చెప్పాడో సినీ కవి. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు  కూడా మియామి బీచుల్లో మునిగితేలుతున్నారు. సముద్రంతో పాటు బికినీ అందాలను ఆస్వాదిస్తున్నారు. 

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ మూడు టీ20లు ముగించుకుని బుధవారం రాత్రి అమెరికాకు చేరింది. ఈ సిరీస్ లో భాగంగా మిగిలిన రెండు మ్యాచులను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.  

ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫేమస్ నగరం మియామి. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ నగరంలోని బీచ్ లు చాలా ప్రసిద్ధిగాంచాయి. ఫ్లోరిడాకు వెళ్లినవాళ్లు మియామికి వెళ్లందే తిరిగిరారు. ఇక్కడి సముద్ర అందాలను వీక్షించిరాకుండా ఉండలేరు. 
 

ఇక మంగళవారం రాత్రి విండీస్ తో మూడు టీ20 ముగిశాక శనివారం వరకు మ్యాచ్ లేకపోవడంతో టీమిండియా  క్రికెటర్లు తమకు దొరికిన కాసింత విశ్రాంతిని మియామి బీచుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. 

హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , శ్రేయాస్ అయ్యర్ లు మియామి అందాలను ఆస్వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేస్తున్నారు.

ఇక భారత్-విండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 జరుగనుండగా.. ఆదివారం ఐదో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచులను ఫ్లోరిడలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అమెరికాలో క్రికెట్ విస్తరణలో భాగంగా ఫ్లోరిడాలో మ్యాచులను జరుపుతున్నారు. మరి బేస్ బాల్, అథ్లెటిక్స్, టెన్నిస్ మీద ఆసక్తి చూపే అమెరికన్లు క్రికెట్ వైపు మళ్లుతారా..? అనేది ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ తో తేలనుంది. 
 

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ కు ఇంకా సమయముండటంతో టీమిండియా క్రికెటర్లు ఒకవైపు ఎంజాయ్ చేస్తుండగా మరోవైపు విండీస్ క్రికెటర్లు మాత్రం బాస్కెట్ బాల్ క్రీడాకారులను కలిశారు. అమెరికాతో పాటు దానికి ఆనుకుని ఉన్న దేశాలలో బాస్కెట్ బాల్ చాలా ఫేమస్.

click me!