మేం మారిపోయాం! ఇప్పుడు వాళ్లు ఫెయిల్ అయినా ఈజీగా 200 కొట్టేస్తాం... - హార్ధిక్ పాండ్యా...

First Published Aug 5, 2022, 1:34 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా ఫెయిల్యూర్‌కి ప్రధానకారణం ఆరంభ మ్యాచుల్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ అయితే, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరిచారు...

31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 57, రిషబ్ పంత్ 39 పరుగులు చేసి ఆదుకోవడంతో 151 పరుగుల ఓ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని పాక్ వికెట్ కోల్పోకుండా ఛేదించి, భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయినా టాపార్డర్ అదరగొడుతుందని అనుకుంటే.. ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్... ఇలా టాపార్డర్‌లో వికెట్లు టపాటపాపడడంతో 110 పరుగులకే పరిమితమై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు...

Image credit: Getty

అయితే ఈసారి మాత్రం ఈ విధంగా జరగదంటున్నాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి రీఎంట్రీ ఇచ్చాడు...

Image credit: PTI

రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో దుమ్మురేగొట్టే పర్ఫామెన్స్ ఇస్తూ, భారత జట్టు వైస్ కెప్టెన్సీని కొట్టేయబోతున్న హార్ధిక్ పాండ్యా... టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు...

Image credit: Getty

‘ఇప్పుడు భారత జట్టు ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తే ఒత్తిడి, మనపైన కాకుండా ప్రత్యర్థి బౌలర్లపైన పడుతుంది.. ఇప్పుడు మేం పూర్తిగా మారిపోయాం...

ప్రస్తుతం భారత జట్టు 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా, ఈజీగా 190 పరుగుల స్కోరు కొట్టేస్తాం.. ఎందుకంటే ఇప్పుడు మా యాటిట్యూడ్ కారణంగా టీమిండియా డేంజరస్‌గా తయారైంది...

గత వరల్డ్ కప్ వేరు, ఈ వరల్డ్ కప్ వేరు. ప్లేయర్లు ఒకేలా ఉండొచ్చు కానీ ఆటతీరులో మార్పు వచ్చింది. నా జీవితంలో కూడా నేను చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నా...

నా పర్ఫామెన్స్‌తో నేను సంతృప్తి చెందుతున్నా. ఇలా ఆడితే ఓవర్ కాన్ఫిడెన్స్ రాదు, అలాగే వరుసగా ఫెయిల్ అవుతున్నామనే బాధకూడా ఉండదు... ఆ బ్యాలెన్స్ చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

2022లో టీమిండియా తరుపున 12 టీ20 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా 31.62 సగటుతో 253 పరుగులు చేశాడు. స్ట్రైయిక్ రేటు 136.75. అలాగే బౌలింగ్‌తో 8 వికెట్లు పడగొట్టాడు...
 

click me!