India Vs South Africa: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా జట్ల రెండో టెస్టు మ్యాచ్ లో భారత ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 55 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 80/3 పరుగులతో చారిత్రాత్మక విజయం సాధించింది.
Mohammed Siraj
ఈ మ్యాచ్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు మరీ ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బౌలర్లకు మహ్మద్ సిరాజ్ చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చడంలో మహ్మద్ సిరాజ్ కీలకంగా ఉన్నాడు. సిరాజ్ 6 వికెట్లు తీసుకుని సఫారీ జట్టు పతనాన్ని శాసించాడు.తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ దెబ్బతో ప్రొటీస్ జట్టు కుప్పకూలింది.
Mohammed Siraj
ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ సిరాజ్ బౌలింగ్ తో అదరగొట్టాడు. 9 ఓవర్ల బౌలింగ్ వేసి కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 3 ఓవర్లు మేడిన్ కావడం విశేషం. అలాగే, ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో మొత్తంగా సిరాజ్ ఏడు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది ఆవార్డ్ గెలుచుకున్నాడు.
భారత్ విజయం స్పందించిన మహ్మద్ సిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన టెస్టు కెరీర్‌లో ఇది తన అత్యుత్తమ ప్రదర్శనగా పేర్కొన్నాడు. బౌలింగ్ లో స్థిరత్వం, పిచ్ పై సరైన ప్లేస్, బ్యాటర్లను ఔట్ చేయడంపై దృష్టి పెట్టి బౌలింగ్ చేసినట్టు తెలిపాడు.
Mohammed Siraj
అలాగే, తాను బుమ్రాతో కలిసి ఆడినప్పుడు ఇద్దరం పిచ్, బ్యాటర్, వికెట్ ను విశ్లేషిస్తామనీ, ఈ విషయంలో బుమ్రా నుంచి తనకు మెసేజ్ అందుతుందని తెలిపారు. అలాగే, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చాలా ధన్యవాదాలు తెలుపుతూ.. ఇలాగే తమకు మద్దతునిస్తూ ఉండాలని కోరాడు.