IND vs SA: 32 ఏండ్ల‌లో దక్షిణాఫ్రికాలో ఇద్దరు కెప్టెన్ల‌కు మాత్రమే సాధ్యమైంది.. రోహిత్ శర్మ స‌రికొత్త రికార్డు

First Published | Jan 5, 2024, 9:57 AM IST

India vs South Africa Test: భార‌త్-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మ‌క విజయం సాధించింది. ఈ విజ‌యంతో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డును న‌మోదుచేస్తూ.. లెజెండ‌రీ క్రికెట‌ర్ ఎంఎస్ ధోని స‌ర‌స‌న నిలిచాడు. 
 

MS Dhoni, Rohit Sharma

Rohit Sharma - MS Dhoni: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మ‌రో స‌రికొత్త రికార్డును న‌మోదుచేశాడు. 32 ఏండ్ల‌లో ద‌క్షిణాఫ్రికాలో ఇద్ద‌రు కెప్టెన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన రికార్డుల లిస్టులో చేరాడు. భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు.

MS Dhoni, Rohit Sharma

ఎంఎస్ ధోని తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.కేప్ టౌన్ వేదికగా గురువారం జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా కూడా టీమిండియా స‌రికొత్త రికార్డును న‌మోదుచేసింది. 


MS Dhoni, Rohit Sharma

1992-93లో భారతదేశం తన మొదటి దక్షిణాఫ్రికా పర్యటనను చేసింది. ఆ పర్యటనలో మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలో మూడు మ్యాచ్‌లు డ్రా కాగా, ఒక మ్యాచ్ ఓడిపోయింది. దీని తర్వాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సారథ్యం వహించిన జట్టుకు ఒక్క విజయం మాత్రమే దక్కింది. 
 

MS Dhoni, Rohit Sharma

చాలా ప‌ర్య‌ట‌న‌ల త‌ర్వాత‌ టెస్టు సిరీస్ గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్నా కల మాత్రం నెరవేరలేదు.  అయితే, 2010లో ఎంఎస్ ధోని నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. అయితే ఆ తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు (2023/4 టెస్టు సిరీస్) రోహిత్ శర్మ సారథ్యంలో మరోసారి సిరీస్‌ను సమం చేయడంలో భార‌త్ విజయం సాధించింది. 
 

MS Dhoni, Rohit Sharma

అయితే, దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ కల ఇప్పటికీ నెరవేరలేదు. ఈసారి జట్టుకు గొప్ప అవకాశం వచ్చినా డీన్ ఎల్గర్ సెంచరీ, ఆఫ్రికన్ బౌలర్లు నిప్పులు చెరుగుతూ భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రెండో టెస్టు మ్యాచ్‌లో పునరాగమనం చేసి రెండు రోజుల్లోనే ఆతిథ్య జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 

Latest Videos

click me!