టీమిండియాకి అందని సెంచరీలు! 7 మ్యాచుల్లో 8 సెంచరీలు మిస్... కోహ్లీ 3, రోహిత్ 2, రాహుల్...

First Published | Nov 2, 2023, 7:25 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా డామినేషన్ కొనసాగుతోంది. వరుసగా డబుల్ హ్యాట్రిక్ మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, శ్రీలంకతో మ్యాచ్‌లో గెలవడం ఖాయంగా మారింది. 
 

ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలు చేసుకున్నారు. 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టు క్యాంపు వచ్చిన సెంచరీలు 2 అయితే, మిస్ అయిన సెంచరీల సంఖ్య 8గా ఉంది..

Virat Kohli-Shubman Gill

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 85 పరుగులు చేసి అవుట్ కాగా, కెఎల్ రాహుల్ 97 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొదటి మ్యాచ్‌లోనే ఈ ఇద్దరూ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు..

Latest Videos


Rohit Sharma

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. సెంచరీ పూర్తి చేసుకునే అవకాశాన్ని 5 పరుగుల తేడాతో కోల్పోయాడు..

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అయితే శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసి పెవిలియన్ చేరారు..
 

Shubman Gill

సెంచరీ లేకుండా వన్డేలో టీమిండియా చేసిన అత్యధిక స్కోరు (357) ఇదే. 7 మ్యాచుల్లో టీమిండియా నుంచి 8 సార్లు భారత బ్యాటర్లు 80+ స్కోర్లు చేసి, సెంచరీని అందుకోలేకపోయారు.

విరాట్ మూడు సార్లు 85+ చేసి సెంచరీ మిస్ చేసుకుంటే రెండు సార్లు రోహిత్‌కి సెంచరీ దక్కలేదు..  ఈ మూడు సెంచరీలు చేసుకుని ఉంటే, విరాట్ ఇప్పటికి సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును అధిగమించి ఉండేవాడు.. 

click me!