2023 ఏడాదిలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశాడు శుబ్‌మన్ గిల్. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2కి ఎగబాకిన శుబ్‌మన్ గిల్, ఒకే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే నెం.1 బ్యాటర్‌గా నిలుస్తాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, డెంగ్యూ కారణంగా భారత జట్టు ఆడిన మొదటి రెండు వరల్డ్ కప్ మ్యాచులకు దూరమయ్యాడు..