తొలి మ్యాచ్‌లో 85 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 55, 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 103 పరుగులు చేసి, వన్డేల్లో 48వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
sachin kohli
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసేలోగా సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును అధిగమిస్తాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు..
‘విరాట్ కోహ్లీ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. వన్డేల్లో అతని గణాంకాలు అసాధారణం. ఇది తక్కువ సమయంలో విరాట్ వన్డేల్లో చేసిన పరుగులు, రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..
Virat Kohli
విరాట్ కోహ్లీ మొదటి నుంచి తన అంతర్జాతీయ కెరీర్‌లో క్వాలిటీని మెయింటైన్ చేశాడు. నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఎప్పుడో సచిన్ టెండూల్కర్‌ని దాటేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ లెజెండ్...
ఛేదనలో విరాట్ బ్యాటింగ్ మామూలుగా ఉండదు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీ ప్లేయర్లు. అతను సూపర్ స్టార్‌లా బ్యాటింగ్ చేస్తాడు. టెస్టుల్లో సచిన్ లెజెండ్ అయితే, వన్డేల్లో కోహ్లీకి కూడా ఆ స్థాయి దక్కాలి...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్...