విశాఖపట్నంలో భారత జట్టు ఓటమికి 5 కారణాలు

Published : Oct 10, 2025, 12:34 AM IST

India vs South Africa : ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో విశాఖపట్నం వేదికగా జరిగిన 10వ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఇండియా ఓటమికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
భారత్ కు షాకిచ్చిన సౌతాఫ్రికా

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గెలుస్తామనుకున్న మ్యాచ్ లో ఓడిపోయింది. డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో 10వ మ్యాచ్ ఉత్కంఠగా జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో భారత్ మంచి స్కోరు చేయాలని భావించింది. కానీ అది జరగలేదు.

25
నిరాశపర్చిన భారత మిడిల్ ఆర్డర్.. ఘోష్ పోరాటం

భారత్ మంచి ఆరంభం చేసినప్పటికీ త్వరగానే వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధానా 23 పరుగులు చేసి ఔటయ్యింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలి 26 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

ఈ సమయంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్ రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె 77 బంతుల్లో 94 పరుగులు (11 ఫోర్లు, 4 సిక్సర్లు) కొట్టి భారత స్కోర్ ను 250+ మార్కును దాటించింది. అమంజోత్ కౌర్ (51 రన్స్ భాగస్వామ్యం), స్నేహ్ రాణా (88 రన్స్ భాగస్వామ్యం)తో కలిసి టీమిండియా స్కోర్ ను 251 పరుగులకు (49.5 ఓవర్లు) చేర్చింది.

భారత్ ఇన్నింగ్స్ ముఖ్య వివరాలు

• భారత్: 251/10 (49.5 ఓవర్లు)

• రిచా ఘోష్: 94 (77 బంతులు)

• స్నేహ్ రాణా: 33 పరుగులు

35
దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న తస్మిన్ బ్రిట్స్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. సునే లూస్ కూడా తక్కువ స్కోర్‌కు ఔటయ్యింది. కానీ కెప్టెన్ లారా వోల్వార్డ్ వికెట్లు పడతున్నా స్థిరంగా ఆడి 111 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు.

క్లోయ్ ట్రయాన్‌తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపారు. వోల్వార్డ్ ఔటైన తర్వాత భారత్ కొంత ఆధిక్యంలోకి వచ్చినా, ఆ తర్వాత మళ్లీ దక్షిణాఫ్రికా పుంజుకుంది.

45
డి క్లర్క్ మాయాజాలం.. చివరి ఓవర్లలో ప్రభావం చూపని భారత్

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. 47వ ఓవర్ లో దక్షిణాఫ్రికా స్కోరు 229/7 పరుగులకు చేరింది. మ్యాచ్ ఉత్కంఠను పెంచింది. అయితే నాడిన్ డి క్లర్క్ చివరలో ధాటిగా ఆడటంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మళ్లింది. ఆమె 54 బంతుల్లో 84 నాటౌట్  పరుగులతో దుమ్మురేపింది. తన ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టారు. దీంతో 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

55
భారత్ ను దెబ్బకొట్టినవి ఇవే

1. మిడిల్ ఆర్డర్ విఫలం: 55/0 పరుగుల నుంచి 26 ఓవర్లలోనే 102/6 పరుగులకు పడిపోవడం భారత్ ను దెబ్బకొట్టింది.

2. రిచా ఘోష్‌ మెరుపులు.. ఇతర బ్యాటర్లు ఫెయిల్: ఈ మ్యాచ్ లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆమె అద్భుతంగా ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

3. చివరి ఓవర్లలో బౌలింగ్ లోపాలు: డెత్ ఓవర్లలో యార్కర్లు, ప్లాన్ మిస్ కావడంతో రన్స్ సులభంగా వచ్చాయి. దీంతో భారత్ కు సౌతాఫ్రికా షాక్ తగిలింది.

4. ఫీల్డింగ్ పొరపాట్లు: : ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు కీలక క్యాచ్లు డ్రాప్ కావడం భారత్ కు ఎదురుదెబ్బగా మారింది.

5. మొమెంటం కోల్పోవడం: వోల్వార్డ్ ఔటైన తర్వాత భారత్ తన బౌలింగ్ దాడిని అదే తరహాలో కొనసాగించలేకపోయారు.

ఇండియా vs సౌతాఫ్రికా స్కోర్ కార్డు

భారత మహిళల జట్టు (INDW)  251 (49.5 ఓవర్లలో ఆలౌట్)

దక్షిణాఫ్రికా మహిళల జట్టు (RSAW)  252/7 (48.5 ఓవర్లలో)

సౌతాఫ్రాకా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాడిన్ డి క్లర్క్.

Read more Photos on
click me!

Recommended Stories