సచిన్‌కి కూడా సాధ్యం కాని రికార్డు కొట్టిన కోహ్లీ... వెస్టిండీస్‌ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌పై..

Published : Jan 31, 2022, 03:12 PM IST

ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో ఫెవరెట్‌ టీమ్ ఉంటుంది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలాంటి టీమ్స్ ఎన్నో. అయితే అన్నింట్లోనూ వెస్టిండీస్ మాత్రం విరాట్ కోహ్లీకి చాలా చాలా స్పెషల్... ఎందుకంటే సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ సాధించలేని రికార్డులు, ఈ కాస్త సమయంలోనే విరాట్ సాధించాడు...

PREV
19
సచిన్‌కి కూడా సాధ్యం కాని రికార్డు కొట్టిన కోహ్లీ... వెస్టిండీస్‌ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌పై..

విరాట్ కోహ్లీకి వెస్టిండీస్‌‌తో మ్యాచ్ అంటే మరో రేంజ్‌లో ఊపు వస్తుంది. ఇప్పటిదాకా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 39 వన్డే మ్యాచుల్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ... 2235 పరుగులు చేశాడు... 

29

వెస్టిండీస్‌పై 2 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 72 సగటుతో 9 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేసి... టాప్‌లో నిలిచాడు...

39

భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూడా వెస్టిండీస్‌పై సరిగ్గా 39 వన్డేలే ఆడడం మరో విశేషం. విండీస్‌పై ఆడిన 29 వన్డేల్లో 52 సగటుతో 1573 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్...

49

మాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి విండీస్‌పై వన్డేల్లో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్‌కీ, సచిన్ టెండూల్కర్‌కీ మధ్య 662 పరుగుల వ్యత్యాసం ఉండడం విశేషం. అంతేకాక విండీస్‌పై కోహ్లీ అత్యధిక స్కోరు 157 పరుగులు కాగా, సచిన్‌ది 141 పరుగులే...

59

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మకు కూడా వెస్టిండీస్‌పై మంచి రికార్డే ఉంది. ఇప్పటిదాకా వెస్టిండీస్‌పై 33 వన్డే మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 1523 పరుగులు చేశాడు..

69

రోహిత్ శర్మకు వెస్టిండీస్‌పై వన్డేల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విండీస్‌పై ‘హిట్ మ్యాన్’ రోహిత్ సగటు 60 కాగా, అత్యధిక స్కోరు 162 పరుగులు... 

79

ఇక్కడ యాదృచ్ఛికమైన విశేషం ఏంటంటే... ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు విండీస్‌పై సరిగ్గా 11 హాఫ్ సెంచరీలు చేయడం. అయితే ఈసారి ఆ రికార్డును అధిగమించే అవకాశం విరాట్, రోహిత్‌ శర్మలకు దక్కనుంది...

89

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి కూడా వెస్టిండీస్‌పై వన్డేల్లో మంచి రికార్డు ఉంది. తన కెరీర్‌లో విండీస్‌పై 40 వన్డేలు ఆడిన ద్రావిడ్ 1348 పరుగులు చేశాడు...

99

వెస్టిండీస్‌పై రాహుల్ ద్రావిడ్ వన్డే సగటు 42 కాగా, తన కెరీర్‌లో విండీస్‌పై 3 వన్డే సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు రాహుల్ ద్రావిడ్. 

Read more Photos on
click me!

Recommended Stories