కోహ్లీ డకౌట్... విరాట్ కావాలనే ఇలా ఆడుతున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచి...

Published : Feb 11, 2022, 02:17 PM IST

విరాట్ కోహ్లీ... తన నిలకడైన బ్యాటింగ్ పర్ఫామెన్స్‌తో క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేసిన బ్యాటర్. ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు బాదిన విరాట్, 71వ సెంచరీ అందుకోలేకపోతున్నాడు... విండీస్‌తో మూడో వన్డేలో సెంచరీ కాదుకదా, కనీసం సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ...

PREV
113
కోహ్లీ డకౌట్... విరాట్ కావాలనే ఇలా ఆడుతున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచి...

విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన రోహిత్ శర్మను అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

213

ఆ తర్వాత రెండో బంతికే వైడ్‌గా వెళ్తున్న బంతిని వెంటాడి, కీపర్ షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ ఓవర్‌తో అదరగొట్టాడు జోసఫ్... 

313

సెంచరీ లేకుండా ఇప్పటికే 67 ఇన్నింగ్స్‌లు ఆడేసిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో డకౌట్ అయ్యాడు. విరాట్‌కి ఇది కెరీర్‌లో 32వ డకౌట్...

413

టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ (31 సార్లు)ని అధిగమించిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (34) తర్వాతి స్థానంలో నిలిచాడు...

513

సచిన్ టెండూల్కర్‌కి కూడా సాధ్యం కాని రీతిలో విండీస్‌పై పరుగుల వర్షం కురిపించిన విరాట్ కోహ్లీ, అదీ స్వదేశంలో ఇలా అవుట్ కావడం... అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు అభిమానులు...

613

తొలి వన్డేలో 8, రెండో వన్డేలో 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ వన్డే సిరీస్‌లో మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే ఇదో చెత్త రికార్డు...

713

వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో ఆడిన వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. రెండో వన్డేలో డకౌట్ అయినా మిగిలిన రెండు మ్యాచుల్లో బ్యాటుతో రాణించి, పర్వాలేదనిపించాడు...

813

రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం మూడో వన్డేల్లో కలిసి కనీసం 30+ పరుగులు చేయకపోవడం చూస్తుంటే, విరాట్ కోహ్లీ కావాలనే ఇలా ఆడుతున్నాడేమోనని అనుమానిస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...

913

విరాట్ నుంచి వన్డే కెప్టెన్సీ లాగేసుకున్న రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచేందుకే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడని, తాను పరుగులు చేయకపోతే భారత జట్టు ఎంత స్కోరు చేయగలదో చూపిస్తున్నాడని అంటున్నారు కొందరు నెటిజన్లు...

1013

వెస్టిండీస్‌తో మూడు వన్డేల్లోనూ రోహిత్ శర్మ అవుటైన తర్వాత కీలక సమయంలో విరాట్ కోహ్లీ అవుట్ కావడం చూస్తుంటే... ఏదో తేడా కొడుతోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

1113

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనవసర షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

1213

రోహిత్ శర్మ త్వరగా అవుట్ కావడంతో భారత జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడి, మ్యాచులు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ ఫీట్‌ను రిపీట్ చేసి, కీలక సమయంలో వికెట్ పారేసుకుంటే జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియచేయాలని చూస్తున్నాడని అంటున్నారు రోహిత్ అభిమానులు...

1313

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడని అందరూ ఆశిస్తే, అతను మాత్రం ఓ రెబల్‌లా తయారవుతున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories