IPL2022 Auction: వేలానికి ముందు పంజాబ్ కు ఊహించని షాకిచ్చిన జాఫర్.. ప్రీతి జింటా కూడా..

Published : Feb 11, 2022, 12:25 PM IST

IPL2022 Auction:  రేపటి నుంచి జరుగబోయే మెగావేలానికి ముందు పంజాబ్ జట్టు కు  భారీ షాక్ తగిలింది. మూడు సీజన్ల పాటు ఆ జట్టు కు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న జాఫర్.. 

PREV
17
IPL2022 Auction: వేలానికి ముందు పంజాబ్ కు ఊహించని షాకిచ్చిన జాఫర్.. ప్రీతి జింటా కూడా..

ఐపీఎల్ మెగా వేలానికి సరిగ్గా ఒక్కరోజు ముందు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి భారీ షాకిచ్చాడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్. ఇన్నాళ్లు ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించిన అతడు  వేలానికి  ముందు రోజు  కీలక నిర్ణయం తీసుకున్నాడు. 
 

27

ఇక తాను పంజాబ్ కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించలేనని  జాఫర్ ప్రకటించాడు.  ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశాడు. 
 

37

ట్విట్టర్ లో జాఫర్ స్పందిస్తూ.. ‘పంజాబ్ కింగ్స్  యాజమన్యానికి ధన్యవాదాలు. ఇన్ని రోజులు కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. రాబోయే సీజన్ లో మీరు అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను.  బెస్ట్ ఆఫ్ లక్..’ అని రాసుకొచ్చాడు. 
 

47

కాగా.. తాను  బ్యాటింగ్ కోచ్ గా తప్పుకుంటున్నానే విషయాన్ని కూడా ఫన్నీ గా ప్రకటించాడు జాఫర్.. రణ్బీర్ కపూర్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’  లోని ఓ మీమ్ ను షేర్ చేసి ఈ ప్రకటన చేశాడు.  
 

57

2019 నుంచి జాఫర్.. పంజాబ్ కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2021 సీజన్ దాకా ఆ పదవిలో కొనసాగాడు. జాఫర్ శిక్షణలో పంజాబ్ బాగానే ఆడింది. కెఎల్ రాహుల్,  మయాంక్ అగర్వాల్ త్ పాటు ఇతర   ఆటగాళ్లు  మెరుగైన ప్రదర్శనలు చేశారు. 
 

67

ఇదిలాఉండగా.. 2022 ఐపీఎల్  రిటెన్షన్ ప్రక్రియలో  భాగంగా.. కెఎల్  రాహుల్ పంజాబ్ ను వీడిన విషయం తెలిసిందే. అతడు పంజాబ్ ను వీడి లక్నో తో  చేతులు కలిపాడు.  
 

77

పంజాబ్ కు మరో షాక్ తగిలింది. ఈ వేలానికి పంజాబ్ ఫ్రాంచైజీ ఓనర్  ప్రీతి జింటా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇటీవలే తల్లిగా ప్రమోట్ అయిన ప్రీతి జింటా..  కుటుంబంతో కలిసి  విదేశాలలో ఉంటున్నది.  

click me!

Recommended Stories