అప్పుడు వెంకటేశ్ అయ్యర్, ఇప్పడు దీపక్ హుడా... అసలు టీమిండియాకి ఎలాంటి ప్లేయర్ కావాలి...

Published : Feb 11, 2022, 01:48 PM IST

సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలకు ఎంపికైన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన దీపక్ చాహార్ కూడా మూడో వన్డేలో చోటు కోల్పోయాడు...

PREV
111
అప్పుడు వెంకటేశ్ అయ్యర్, ఇప్పడు దీపక్ హుడా... అసలు టీమిండియాకి ఎలాంటి ప్లేయర్ కావాలి...

హార్ధిక్ పాండ్యా వెన్నెముక గాయంతో బాధపడుతూ బౌలింగ్ చేయలేకపోతుండడంతో అతని స్థానంలో సరైన ఆల్‌రౌండర్ కోసం చూస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్...

211

అయితే ఐపీఎల్ 2021 సీజన్, ఆ తర్వాత విజయ్ హాజారే ట్రోఫీల్లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌ను రెండు వన్డేల్లో మాత్రమే ఆడించిన కెఎల్ రాహుల్, అతన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు...

311

మొదటి వన్డేలో వెంకటేశ్ అయ్యర్‌కి బౌలింగే ఇవ్వని కెఎల్ రాహుల్, రెండో వన్డేలో అతనితో 5 ఓవర్లు వేయించాడు. 5 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు అయ్యర్...

411

మొదటి వన్డేలో 2 పరుగులకే అవుటై నిరాశపరిచినా, రెండో వన్డేలో 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయినప్పటికీ అతనికి మూడో వన్డేలో చోటు దక్కలేదు...

511

అతని స్థానంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన దీపక్ హుడా పరిస్థితి కూడా ఇదే.. తొలి వన్డేలో 116 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 32 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఐదో వికెట్‌కి 62 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదుచేశాడు...

611

రెండో వన్డేలో బ్యాటింగ్‌కి కష్టంగా ఉన్న పిచ్‌పై 25 బంతుల్లో 2 ఫోర్లతో 29 పరుగులు చేసిన దీపక్ హుడా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగలిగాడు...

711

అయినా దీపక్ హుడాకి మూడో వన్డేలో చోటు దక్కలేదు. దీంతో అసలు టీమిండియాకి ఎలాంటి ప్లేయర్ కావాలి? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

811

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి స్టార్ సీనియర్ ఆల్‌రౌండర్లు కూడా కెరీర్ ఆరంభంలో ఫెయిల్ అయినవాళ్లే. అయినా వారిపై పూర్తి విశ్వాసంతో వరుస అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించాడు అప్పటి కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...

911

అయితే ఇప్పుడు టీమిండియా చేస్తున్న మార్పులను బట్టి చూస్తుంటే, ఆడితే రెండు వన్డేల్లో ఇరగదీసేయాలి, లేదంటూ మూడో వన్డేలో టీమ్‌లో చోటు ఉండదు అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది...

1011

వన్డే వరల్డ్‌కప్‌కి ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఓ పటిష్టమైన జట్టును తయారుచేయడంపై మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టాలి. ఇలా చిటికీ మాటికీ జట్టులో మార్పులు చేస్తూ పోతే... సరైన టీమ్‌ను తయారుచేయడం ఇప్పట్లో అయ్యే పని కాదు... అంటున్నారు విశ్లేషకులు...

1111

చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ సమయానికి హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఎలాగైనా అందుబాటులో ఉంటారా? ఆలోపు మరో ఆల్‌రౌండర్ సిద్ధమైపోతే జట్టు కూర్పు కష్టమైపోతుందని కావాలని వీరిని సరిగా ఉపయోగించుకోవడం లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు...

click me!

Recommended Stories