చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను జారవిడిస్తే ఎలా... టీమిండియా ఆటతీరుపై జహీర్ ఖాన్ ఆందోళన...

Published : Jun 14, 2022, 12:44 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆకట్టుకున్న ప్లేయర్లను ఆచితూచి, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే మొదటి రెండు మ్యాచుల్లో మాత్రమే టీమిండియా ప్లేయర్లు ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేక, పరాజయం పాలయ్యారు. దీంతో మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడింది భారత జట్టు...

PREV
16
చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను జారవిడిస్తే ఎలా... టీమిండియా ఆటతీరుపై జహీర్ ఖాన్ ఆందోళన...

కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత నాలుగో వికెట్ పడగొట్టలేకపోయిన భారత జట్టు, మ్యాచ్‌ను చేజేతులా జార్చుకున్నట్టైంది...

26

పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసిన తర్వాత కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది భారత జట్టు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఫెయిల్ అవ్వడం భారత జట్టును తీవ్రంగా దెబ్బ తీసింది...

36

‘టీమిండియా అసలు సమస్య ఇదే. టీ20ల్లో మ్యాచ్ చేతులు మారడానికి పెద్దగా సమయం పట్టదు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ఒడిసిపట్టుకోకపోతే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...

46

ఇలాంటి మ్యాచుల్లో ఓడితే, జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. టీమ్‌లో వాతావరణంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. వరల్డ్ కప్‌ వంటి మెగా టోర్నీలు ఉన్న సమయంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు...

56

టాస్‌లతో సంబంధం లేకుండా మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. అప్పుడు జట్టులో ఉత్సాహం నిండుతుంది. కీలక ప్లేయర్లు లేనప్పుడు జూనియర్లు వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకోవాలి... అదే ఫ్యూచర్‌కి కావాల్సిన బూస్ట్ అందిస్తుంది...

66

మంచి ఆరంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోకపోతే వృథాయే అవుతుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ గెలవడం చాలా కష్టమే. అయితే దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి... టీమ్ కల్చర్‌కి ఇది చాలా అవసరం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్... 

click me!

Recommended Stories