ఆడాలని ఉన్నా, ఆ కారణంగానే రిటైర్మెంట్ ఇచ్చేశా... టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్...

Published : Jun 13, 2022, 05:51 PM IST

23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది టీమిండియా వుమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత కొన్ని రోజులకు ఆమె రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయానికి ప్రేరిపించిన విషయాల గురించి బయటపెట్టింది మిథాలీ...

PREV
18
ఆడాలని ఉన్నా, ఆ కారణంగానే రిటైర్మెంట్ ఇచ్చేశా... టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్...
Mithali Raj

డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది...

28

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది...
 

38

వన్డేల్లో 71 హాఫ్ సెంచరీలు చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మిథాలీరాజ్, 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగింది. సచిన్ టెండూల్కర్ కంటే సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌ కొనసాగిస్తూ, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉంది మిథాలీ రాజ్...

48

వన్డేల్లో 5 సార్లు 90+ స్కోర్లు చేసిన మిథాలీ రాజ్, వన్డేల్లో 155 మ్యాచులకు కెప్టెన్‌గా చేసి రికార్డులు క్రియేట్ చేసింది...  ఆరు వన్డే ప్రపంచకప్ లలో ఆడిన  తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది మిథాలీ. పురుషుల క్రికెట్ లో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ పేరిట ఉంది.  సచిన్ తన కెరీర్ లో 1992, 1996, 1999, 2003, 2007, 2011  వన్డే ప్రపంచకప్ లలో భారత్ తరఫున ఆడాడు.  మిథాలీ రాజ్ 2000, 2005, 2009, 2013, 2017, 2022 వన్డే వరల్డ్ కప్ లలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది. 

58

34-35 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ వార్తల ప్రవాహం మొదలైపోతుంది. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ అందరూ ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. మిథాలీ రాజ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె రిటైర్మెంట్ గురించి ఎన్నో ఏళ్లుగా ఊహగానాలు వినిపిస్తూనే ఉన్నాయి...

68

‘రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ఇప్పుడు వచ్చింది కాదు. చాలా రోజులుగా అనుకుంటున్నదే. 23 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలని నాకు తెలుసు. టీమ్‌లో ప్లేస్ కోసం ఎంతో మంది అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. నా వల్ల వాళ్లకు ప్లేస్ దక్కకుండా పోకూడదు...

78

వన్డే వరల్డ్ కప్ గెలవాలనేది నా చిన్ననాటి కల. ఈసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయాం. నా కల నెరవేరలేదు. లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. వచ్చే వరల్డ్ కప్ దాకా ఆడే అవకాశం లేదు...

88
Mithali Raj

అందుకే ఏ లక్ష్యం లేకుండా ఆడడం వృథా అనిపించింది. అందుకే ఆడే సత్తా ఉన్నా క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది...’ అంటూ చెప్పుకొచ్చింది మిథాలీ రాజ్... 

click me!

Recommended Stories