హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డుకి ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ... సౌతాఫ్రికాలో టెండూల్కర్ రికార్డుకి..

Published : Jan 11, 2022, 05:28 PM IST

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవచ్చు. ఇంతకుముందులా సెంచరీల వర్షం, పరుగుల వరద పారించలేకపోతుండొచ్చు... అయినా విరాట్ కోహ్లీ సృష్టిస్తున్న రికార్డులకు మాత్రం బ్రేక్ పడడం లేదు... తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్...

PREV
18
హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డుకి ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ... సౌతాఫ్రికాలో టెండూల్కర్ రికార్డుకి..

సౌతాఫ్రికాలో ప్రస్తుతం ఏడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 625+ పరుగులు చేశాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రావిడ్‌ని అధిగమించాడు విరాట్...

28

ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సఫారీ గడ్డపై 11 టెస్టు మ్యాచులు ఆడి 624 పరుగులు చేశాడు... ఇప్పటిదాకా సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఉండేవాడు ద్రావిడ్... ఇప్పుడు ఆ రికార్డు విరాట్‌ పుస్తకాల్లోకి వెళ్లిపోయింది...

38

అయితే టీమిండియా తరుపున సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాలంటే మాత్రం విరాట్ కోహ్లీ మరికొంత కాలం ఆగాల్సిందే...

48

సౌతాఫ్రికాలో 15 టెస్టు మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్... ఏకంగా 1161 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు.  రాహుల్ ద్రావిడ్‌ని అధిగమించిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డును చేరుకోవాలంటే మరో 500+ పరుగులు చేయాల్సి ఉంటుంది...

58

మొదటి టెస్టులో స్టంప్స్‌కి దూరంగా వెళ్తున్న వికెట్లను వెంటాడి అవుట్ అయిన విరాట్ కోహ్లీ, కేప్‌ టౌన్ టెస్టులో పూర్తిగా రూట్ మార్చి ఆడుతున్నాడు...

68

జిడ్డు బ్యాటింగ్ చేసే ఛతేశ్వర్ పూజారా 74 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 77 బంతుల్లో కేవలం 2 ఫోర్లతో 17 పరుగులు మాత్రమే చేశాడు...

78

ఓపెనర్లు కెఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో పూజారా, కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

88

77 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

Read more Photos on
click me!

Recommended Stories