Happy Birthday Vamika: కోహ్లి గారాల పట్టి వామిక బర్త్ డే.. ట్విట్టర్ లో శుభాకాంక్షల వెల్లువ..

Published : Jan 11, 2022, 03:05 PM IST

Happy Birthday Vamika:  భారత టెస్టు క్రికెట్  జట్టు సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్  నటి అనుష్క శర్మ ల  ముద్దుల కూతురు వామిక ఇవాళ  మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నది.   

PREV
18
Happy Birthday Vamika: కోహ్లి గారాల పట్టి వామిక బర్త్ డే..  ట్విట్టర్ లో శుభాకాంక్షల వెల్లువ..

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మల గారాల పట్టి వామిక  ఇవాళ తొలి పుట్టినరోజును జరుపుకుంటున్నది.  గతేడాది జనవరి 11న అనుష్క శర్మ.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వామికకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

28

సరిగ్గా అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్..  ప్రత్యేక పర్మిషన్ తో  భారత్ కు వచ్చాడు. అప్పటికీ భారత జట్టు తొలి  టెస్టులో అవమానకర రీతిలో ఓడింది. కోహ్లి భారత్ కు  తిరిగిరావడంపై  అప్పట్లో విమర్శలు వెల్లువెత్తినా అతడు మాత్రం.. అవన్నీ పట్టించుకోలేదు. 

38

ఇక వామిక పుట్టినతర్వాత కోహ్లి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్ల తండ్రిగా అతడు పరిణితితో కూడిన వ్యక్తిత్వాన్ని అలవరుచుకున్నాడు.  ఒకరకంగా వామిక  వచ్చిన తర్వాత  తామిద్దరూ (అనుష్క-కోహ్లి) పరిపూర్ణమయ్యామంటాడు కోహ్లి. 

48

విరాట్ ఇంట సంబురాలు తీసుకొచ్చిన వామిక ఫోటో ఇంతవరకు ఎలా ఉంటుందో తెలియదు.  కనీసం ఆమెకు సంబంధించిన ఫోటో కూడా బయటకు రాలేదు. 

58

విరాట్-అనుష్క లు పలుమార్లు వామిక ఫోటోను షేర్ చేసినా అది వెనకనుంచే.. వామిక ముఖం ఎలా ఉంటుందో ఆమెను చూసినవాళ్లకు తప్ప వేరేవాళ్లకు తెలియదు. 

68

కోహ్లి-అనుష్క అభిమానులతో పాటు టీమిండియా అభిమానులు కూడా వామికను విరాట్ ఎప్పుడు పరిచయడం చేస్తాడని ఎదురుచూస్తున్నారు. కానీ ఇవాళ ఈ ఇద్దరూ అందుకు సంబంధించి ఒక్క పోస్టు కూడా చేయలేదు. 

78
Vamika

ఇదిలాఉండగా.. టీమిండియా అభిమానులు మాత్రం  వామిక బర్త్ డే ను పురస్కరించుకుని ఆమెకు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

88

ఇవాళ సాయంత్రం వామిక పుట్టినరోజు వేడుకలను విరాట్ కోహ్లి టీమిండియా సభ్యుల మధ్య నిర్వహించే అవకాశమున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొదటి పుట్టినరోజు సందర్భంగా అయినా కోహ్లి.. వామిక ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడేమోనని అభిమానులు వేయి కండ్లతో వేచి చూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories