విరాట్ కోహ్లీకి, రిషబ్ పంత్‌కీ అదొక్కటే తేడా... లేదంటేనా ఈపాటికి...

First Published Jan 13, 2022, 8:00 PM IST

సౌతాఫ్రికాలో జరుగుతున్న కేప్‌ టౌన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సంచలన ఇన్నింగ్స్‌లో రికార్డు సెంచరీ నమోదు చేశాడు రిషబ్ పంత్... సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పంత్...

58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... ఈ భాగస్వామ్యంలో విరాట్ కోహ్లీ 15 పరుగులు చేయగా రిషబ్ పంత్ 71 పరుగులు చేశాడు...

విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 7, శార్దూల్ ఠాకూర్ 5 పరుగులు చేసి అవుట్ అయిన సమయంలో రిషబ్ పంత్ స్కోరు 77 పరుగులు...

ఈ దశలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను మరో ఎండ్‌లో నిలబెట్టి 94 పరుగులకు చేరుకున్న రిషబ్ పంత్... బుమ్రాతో కలిసి ఆఖరి వికెట్‌కి 8 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

సరిగ్గా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు... పంత్‌కి జరిగినట్టే, కోహ్లీకి కూడా అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు...

తొలి ఇన్నింగ్స్‌లో ఎంతో ఓపికగా ఆడుతూ రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కి 51 పరుగులు జోడించాడు విరాట్ కోహ్లీ... పంత్ అవుటయ్యే సమయానికి విరాట్ కోహ్లీ 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

ఆ తర్వాత అశ్విన్ 2, శార్దూల్ ఠాకూర్ 12 పరుగులు చేసి అవుట్ కాగా అప్పటికి 70+ పరుగులకి చేరుకున్న విరాట్ కోహ్లీ... టెయిలెండర్లతో కలిసి సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు...

రిషబ్ పంత్ బౌండరీలు బాదుతూ, సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచగా... విరాట్ కోహ్లీ ఆఖరి రెండు వికెట్లు ఉన్న టైంలో కూడా సింగిల్స్ తీయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు...

రిషబ్ పంత్ కీలక సమయంలో సిక్సర్లు బాది స్కోరు వేగాన్ని పెంచగా రెండేళ్లుగా సెంచరీ లేని విరాట్ కోహ్లీ... డిఫెన్సివ్ ఆటతీరుతో త్రిబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయాడు...

అదీకాకుండా విరాట్ కోహ్లీ విషయంలో కొంచెం లక్ కూడా కలిసి రాలేదు. షమీ, ఉమేశ్ యాదవ్‌ల కంటే బుమ్రా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా రావడంతో కోహ్లీకి అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం దక్కలేదు...

తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ సెంచరీకి తక్కువేమీ కాదు, అయితే వికెట్లు పడుతుంటే సెంచరీ చేసుకోవాలని, స్కోరు పెంచాలనే ఆలోచనతో కాకుండా ఎక్కువసేపు ఇన్నింగ్స్ కొనసాగించాలనే దానిపైనే ఫోకస్ పెట్టాడు టీమిండియా కెప్టెన్...

మరో వైపు రిషబ్ పంత్ మాత్రం ఉన్నంతసేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి కావాల్సినన్ని ఎక్కువ పరుగులు చేయాలని నిర్ణయించుకుని బ్యాటింగ్ చేశాడు. ఫలితం రిషబ్ పంత్‌కి రికార్డు సెంచరీ...

click me!