ఆ ఇద్దరికీ అవకాశం దొరికేనా... డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తుందా...

Published : Jun 19, 2022, 04:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపికయ్యారు యంగ్ ఫాస్ట్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్. అయితే ఇప్పటిదాకా జరిగిన మొదటి నాలుగు మ్యాచుల్లోనూ  ఈ ఇద్దరికీ అవకాశం దక్కలేదు...

PREV
17
ఆ ఇద్దరికీ అవకాశం దొరికేనా... డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తుందా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 150+కి.మీ.ల వేగంతో బంతులు విసిరి, క్రేజ్ సంపాదించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, చాలా తొందరగానే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు...

27

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, ప్రాక్టీస్ సెషన్స్‌లో 163.7 కి.మీ.ల వేగంతో బంతులు విసిరి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు...

37

ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో 2003 వన్డే వరల్డ్ కప్‌లో పాక్ మాజీ పేసర్ షోయ్ అక్తర్ విసిరిన 161.3 కి.మీ.ల డెలివరీయే, అత్యంత వేగవంతమైన బాల్‌గా నిలిచింది. దీన్ని ఉమ్రాన్ మాలిక్ అధిగమిస్తాడని భావించారంతా. అయితే సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చిన టీమిండియా, యంగ్ బౌలర్లకు ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేదు...

47

ఐపీఎల్ 2022 సీజన్‌ పంజాబ్ కింగ్స్ రిటెన్షన్‌లో చోటు దక్కించుకున్న యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. ఐపీఎల్ 2021 సీజన్‌లో 18 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, ఈ సీజన్‌లో ఆ జట్టుకి డెత్ బౌలర్‌గా అదరగొట్టాడు. డెత్ ఓవర్లను స్టార్ బ్యాటర్లను బౌండరీలు బాదకుండా కట్టడి చేసి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు...

57

ఈ ఇద్దరూ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సాధారణంగా అయితే మొదటి మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటే, మిగిలిన రెండు మ్యాచుల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం టీమిండియా ఆనవాయితీ. అయితే మొదటి రెండు మ్యాచులు సౌతాఫ్రికా గెలవడంతో ఇప్పుడు సిరీస్ రిజల్ట్ కోసం ఆఖరి మ్యాచ్ దాకా ఎదురుచూడాల్సి వస్తోంది.

67

మూడు, నాలుగు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. దీంతో సిరీస్ డిసైడర్‌లో సీనియర్లను పక్కనబెట్టి కుర్రాళ్లకు అవకాశం ఇస్తారా? అనేది అనుమానంగా మారింది...

77

సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు సంపాదించుకోవాలని ఆశపడిన ఈ ఇద్దరికీ నిరాశే ఎదురుకానుంది. టీ20 వరల్డ్ కప్‌ 2022 సీజన్ ఆడే జట్టుకు పోటీ తక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే టీమిండియా, ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వలేదని అంటున్నారు కొందరు అభిమానులు..

click me!

Recommended Stories