మంచి ప్లేయర్లు తప్పుల నుంచి నేర్చుకుంటారు, కానీ అతను అలా కాదు... భారత యంగ్‌స్టర్‌పై డేల్ స్టెయిన్..

Published : Jun 19, 2022, 02:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత కీలక ఆటగాళ్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్.. టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడితే ఇప్పుడు ఆ లిస్టులో రిషబ్ పంత్ కూడా చేరిపోయాడు...

PREV
18
మంచి ప్లేయర్లు తప్పుల నుంచి నేర్చుకుంటారు, కానీ అతను అలా కాదు... భారత యంగ్‌స్టర్‌పై డేల్ స్టెయిన్..

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ 14 మ్యాచులు ఆడి 340 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు... సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లోనూ పంత్ పర్ఫామెన్స్ పెద్దగా ఇంప్రెసివ్‌గా ఏమీ లేదు...

28
Image credit: PTI

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో 4 మ్యాచుల్లో కలిపి 57 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. తొలి టీ20లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రిషబ్ పంత్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో కలిపి 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

38
Image credit: PTI

ఓ వైపు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అదరగొడుతూ భారత జట్టుకి ఫినిషర్‌గా మారిపోయాడు. నాలుగో టీ20లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అదరగొట్టాడు...

48
Image credit: PTI

‘రిషబ్ పంత్‌కి ఈ సిరీస్‌లో నాలుగు అవకాశాలు వచ్చాయి. అయితే నాలుగు మ్యాచుల్లోనూ ఒకే తప్పు చేసి అవుట్ అయ్యాడు. మంచి ప్లేయర్లు ఎప్పుడూ చేసిన తప్పు మళ్లీ చేయరు... ఎందుకంటే చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు...
 

58
Image credit: PTI

కానీ రిషబ్ పంత్ అలా చేయడం లేదు. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేసి వికెట్ పారేసుకుంటున్నాడు. దినేశ్ కార్తీక్ ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ తాను ఎంత క్లాస్ ప్లేయరో నిరూపించుకుంటున్నాడు...

68
Image credit: PTI

వరల్డ్ కప్ గెలవాలంటే ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌నే సెలక్ట్ చేయాలి. అలా చూసుకుంటే రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్ ఇప్పుడు చాలా ముందున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో దినేశ్ కార్తీక్ పేరు తప్పక ఉండాలి...

78

ఈ ఏడాది అతని పర్ఫామెన్స్ మ్యాచ్ మ్యాచ్‌కీ మరింత మెరుగవుతోంది. వికెట్ కీపర్‌గానూ దినేశ్ కార్తీక్ సత్తా ఏంటో అందరికీ తెలుసు. ఆటను చక్కగా అర్థం చేసుకోగలడు. పంత్ కంటే కార్తీక్‌కి చాలా అనుభవం ఉంది...

88

దినేశ్ కార్తీక్ 360 డిగ్రీస్ ప్లేయర్. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్స్ చక్కగా ఆడగలడు. బౌలర్ ఏ బాల్ వేయగలడో ముందే అంచనా వేయగలడు.. అతనే రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌ చాలా ముందున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్... 

Read more Photos on
click me!

Recommended Stories