37 ఏళ్ల దినేశ్ కార్తీక్, 18 ఏళ్ల క్రితం 2004లో టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. పార్థివ్ పటేల్ పేలవ పర్ఫామెన్స్‌తో అతని స్థానంలో టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, తొలి మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడాడు...
29
అప్పటి హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్‌తో విభేదాలతో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఆ పొజిషన్‌లోకి రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2007 వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్...
39
వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో సభ్యుడిగానూ ఉన్నాడు దినేశ్ కార్తీక్. ఈ మ్యాచ్ ఆడిన ఇరు జట్లలో దినేశ్ కార్తీక్ మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ రిటైర్మెంట్ తీసుకున్నారు...
49
Image credit: PTI
2007 వన్డే వరల్డ్ కప్ ఘోర పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్, టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీ20, వన్డే ఫార్మాట్‌లో బాధ్యతలను అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ... అనిల్ కుంబ్లే టెస్టు సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు...
59
Image credit: PTI
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో వైట్ బాల్ మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, అనిల్ కుంబ్లే కెప్టెన్సీ టెస్టు మ్యాచులు కూడా ఆడాడు...
69
Image credit: PTI
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్.లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2019 ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్...
79
ఎమ్మెస్ ధోనీ గైర్హజరీలో సురేష్ రైనా, అజింకా రహానే కెప్టెన్సీలో మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ 2018 గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు...
89
దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పుడు రిషబ్ పంత్ వయసు ఏడేళ్లు. ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న దినేశ్ కార్తీక్, ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు...