అప్పుడు రహానే బదులు రోహిత్ శర్మను ఆడించి తప్పు చేశాం... సౌతాఫ్రికా పర్యటనపై రవిశాస్త్రి కామెంట్స్...

Published : Dec 13, 2021, 09:35 AM IST

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత జట్టు, ఇప్పటిదాకా సౌతాఫ్రికా గడ్డపైన మాత్రం టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 2018-19 సీజన్‌లో టెస్టు, వన్డే సిరీస్ గెలిచినా టెస్టు సిరీస్ మాత్రం దక్కించుకోలేకపోయింది...

PREV
110
అప్పుడు రహానే బదులు రోహిత్ శర్మను ఆడించి తప్పు చేశాం... సౌతాఫ్రికా పర్యటనపై రవిశాస్త్రి కామెంట్స్...

గత సౌతాఫ్రికా పర్యటనలో ఫామ్‌లో ఉన్న టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేని తప్పించి, మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మకు అవకాశాలు ఇచ్చింది భారత జట్టు...

210

అయితే ఈ ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టు టీమ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 19.50 సగటుతో 78 పరుగులే చేయగలిగాడు...

310

మూడో టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన అజింకా రహానే, ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు... లక్కీగా ఆఖరి టెస్టులో భారత జట్టు 63 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై విజయాన్ని అందుకుంది...

410

‘సౌతాఫ్రికా టూర్‌లో టెస్టుల్లో రోహిత్ శర్మను ఆడించాలా? అజింకా రహానేను ఆడించాలా? అనే విషయంలో చాలా ఆలోచించాం. ఇద్దరినీ ఆడించడానికి అక్కడ అవకాశం లేదు...

510

రోహిత్ శర్మ వన్డే, టీ20ల్లో బాగా రాణిస్తున్నాడు. కాబట్టి టెస్టుల్లో కూడా అతన్ని ఆడించాలని అనుకున్నాం. అందుకే అతని ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని టెస్టుల్లో ఆడించాం...

610

అయితే ఆ ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకే అజింకా రహానేని తిరిగి ఆడించాం. మొదటి రెండు టెస్టుల్లో రహానే ఆడి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేదేమో...

710

అయితే నేను హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడే రోహిత్ శర్మను టెస్టుల్లో సక్సెస్ చేయాలని ఫిక్స్ అయ్యా. టెస్టుల్లో రోహిత్‌ రాణిస్తేనే, నేను కోచ్‌గా సక్సెస్ అయ్యినట్టని భావించా...

810

ఓపెనర్‌గా మార్చిన తర్వాత రోహిత్ శర్మ సక్సెస్ కావడం నాకు సంతృప్తినిచ్చింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి...

910

2019లో ఓపెనర్‌గా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా ఆరంగ్రేటంలోనే డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. స్వదేశంతో పాటు ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ చేసి, విదేశాల్లో సెంచరీ లేని లోటును కూడా తీర్చుకున్నాడు రోహిత్...

1010

ఈ ఏడాది మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉన్న రోహిత్ శర్మను టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ, బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories