యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను సిక్సర్లుగా మలిచిన 2007 టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది చాలామందికి. అయిత యువీ తన క్రికెటింగ్ కెరీర్‌లో అంతకి మించిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
క్యాన్సర్‌తో బాధపడుతూ రక్తపు వాంతులు చేసుకున్నా, పట్టువదలకుండా క్రీజులోనే బ్యాటింగ్ కొనసాగించి... ఆఖరి దాకా ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడని జగమొండి క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే యువీ కెరీర్ మాత్రం ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు...
‘యువరాజ్ సింగ్ కెరీర్‌ను క్యాన్సర్ నాశనం చేసింది. లేకపోతే క్రికెట్ ప్రపంచంలో అతని రేంజ్ వేరేగా ఉండేది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వస్ కలీస్ వంటి లెజెండ్స్‌తో సమానంగా నిలవాల్సిన ప్లేయర్ యువరాజ్...’ అంటూ కామెంట్ చేశాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్...
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడి, క్రికెట్‌కి దూరమయ్యాడు యువరాజ్ సింగ్. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో క్రీజులోనే యువరాజ్ సింగ్ రక్తపు వాంతులు చేసుకోవడం చూసి, క్రికెట్ ప్రపంచం చలించిపోయింది.
రిటైర్ హార్ట్‌గా పెవిలియన్‌కి వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని వైద్యులు, అంపైర్లు, సహచర క్రికెటర్లు చెప్పినా... ‘ఒకవేళ తాను ఆడుతూ చనిపోయినా సరే కానీ, ఆటను మధ్యలో వదిలిపెట్టనని’ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడని, హర్భజన్ సింగ్ ఆ మ్యాచ్ తర్వాత ఏడుస్తూ చెప్పాడు...
ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి, కోలుకుని 2012 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్... ఆ తర్వాత దాదాపు ఐదేళ్లు జట్టులో కొనసాగినా, మునుపటి రేంజ్‌లో అయితే ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్, టెస్టులు ఆడింది మాత్రం 40 మ్యాచులే. 40 టెస్టుల్లో 1900 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, 9 వికెట్లు పడగొట్టాడు.
2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో తొలి వన్డే ఆడిన యువరాజ్ సింగ్, 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు. అయితే దాదాపు మూడేళ్ల పాటు టెస్టుల్లో తుది జట్టులో ప్లేస్ కోసం యువీ ఎదురుచూడాల్సి వచ్చింది.
2004లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 59 పరుగులు చేసి తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేసిన యువీ, ఆ తర్వాత రెండో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. ఆసీస్ టూర్‌లో రాణించినప్పటికీ అతన్ని టెస్టు టీమ్ నుంచి తప్పించింది బీసీసీఐ...
జూన్ 30, 2017లో వెస్టిండీస్‌పై తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన యువరాజ్ సింగ్, దాదాపు రెండేళ్ల పాటు టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూసి... 2019 జూన్ 10న రిటైర్మెంట్ ప్రకటించాడు.
వన్డే కెరీర్‌లో 304 మ్యాచులు ఆడి 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, బౌలింగ్‌లో 111 వికెట్లు పడగొట్టాడు. 58 వన్డేల్లో 1177 పరుగులతో పాటు 29 వికెట్లు తీశాడు.
2021 ఆరంభంలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించినా, విదేశీ లీగ్‌లో పాల్గొనడంతో యువీ రీఎంట్రీకి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ అంగీకరించలేదు...